Homeసినిమారణవీర్ సింగ్ పై బ్యాన్ విధించిన బాలీవుడ్.. రూ.45 కోట్ల వివాదం బాలీవుడ్‌లో కలకలం!

రణవీర్ సింగ్ పై బ్యాన్ విధించిన బాలీవుడ్.. రూ.45 కోట్ల వివాదం బాలీవుడ్‌లో కలకలం!

క్రైమ్ మిర్రర్, సినిమా:- బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. డాన్ 3 సినిమా వివాదం ఊహించని మలుపు తీసుకోవడంతో ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ రణ్‌వీర్‌పై నాన్-కోఆపరేషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో బాలీవుడ్‌లో ఒక్కసారిగా పెద్ద చర్చ మొదలైంది. రణ్‌వీర్ చేస్తున్న లేదా చేయబోయే ప్రాజెక్టులకు ఫెడరేషన్ సభ్యులు సహకరించబోరని ప్రకటించడం మరింత సంచలనంగా మారింది.ఈ వ్యవహారంపై ఫెడరేషన్ అధ్యక్షుడు అశోక్ పండిట్ స్పందించారు. ఫర్హాన్ అఖ్తర్ నుంచి ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసును నమోదు చేశామని చెప్పారు. ఆ తర్వాత రణ్‌వీర్ సింగ్‌కు మూడు నోటీసులు పంపించామని, ప్రతి 10 రోజులకు ఒకసారి స్పందించాలంటూ అవకాశం ఇచ్చామని తెలిపారు. కానీ ఎలాంటి సమాధానం రాలేదన్నారు. ప్రెస్ మీట్ ప్రకటించిన తర్వాత మాత్రమే రణ్‌వీర్ టీమ్ నుంచి మెయిల్ వచ్చిందని, ఈ వ్యవహారంలో ఫెడరేషన్ జోక్యం చేసుకునే హక్కు లేదని అందులో పేర్కొన్నారని వెల్లడించారు.

డాన్ 3 సినిమాను ఫర్హాన్ అఖ్తర్ 2023లో ప్రకటించారు. అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ తర్వాత డాన్ పాత్రలో రణ్‌వీర్ సింగ్ కనిపించనున్నాడని టీజర్ ద్వారా వెల్లడించారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే షూటింగ్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందు రణ్‌వీర్ సినిమా నుంచి తప్పుకున్నారని ఫర్హాన్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం ఇప్పటికే సుమారు రూ.45 కోట్లు ఖర్చు చేసినట్టు నిర్మాతలు ఫెడరేషన్‌కు వివరించారు. ఇలాంటి కీలక సమయంలో హీరో తప్పుకోవడం వల్ల భారీ నష్టం వచ్చిందని తెలిపారు. దీంతో ఈ విషయాన్ని ఫెడరేషన్ సీరియస్‌గా తీసుకుంది.ఈ వివాదంపై రణ్‌వీర్ సింగ్ టీమ్ కూడా స్పందించింది. సినీ పరిశ్రమపై, డాన్ ఫ్రాంచైజీపై తనకు ఎప్పుడూ గౌరవం ఉందని తెలిపింది. ఇటీవల జరిగిన పరిణామాలపై మౌనం పాటించామని, పబ్లిక్‌గా స్పందించాల్సిన అవసరం అనిపించలేదని పేర్కొంది. ప్రస్తుతం తన పూర్తి దృష్టి సినిమాలు, భవిష్యత్ కమిట్‌మెంట్లపైనే ఉందని స్పష్టం చేసింది.ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు బాలీవుడ్‌లో మరింత ఆసక్తిని పెంచుతోంది. డాన్ 3 భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చూడాలి.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు