Homeతెలంగాణచెన్నూర్‌లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం...!మంత్రి వివేక్

చెన్నూర్‌లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం…!మంత్రి వివేక్

చెన్నూర్, క్రైమ్ మిర్ర‌ర్‌: జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు మరియు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈసారి చెన్నూర్ నియోజకవర్గంలో వరి పంట అంచనాలకు మించి అధిక దిగుబడి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

రైతులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, దీంతో కొనుగోలు ప్రక్రియ త్వరితగతిన పూర్తవుతుందని మంత్రి సూచించారు. చెన్నూర్ ప్రాంతంలో ధాన్యం నిల్వ కోసం గోదాముల సౌకర్యాలను పెంచడంతో పాటు హమాలీల సంఖ్యను కూడా పెంచుతున్నామని వెల్లడించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లారీలకు అదనంగా మరో 75 లారీలను టాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్‌తో పాటు అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోలు ప్రక్రియపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోందని చెప్పారు.

రాబోయే వారం రోజుల్లో రైతుల వద్ద ఉన్న ప్రతి గింజను కొనుగోలు చేసి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర చెల్లిస్తామని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా, ఆలస్యం చేయకుండా తమ వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు