Homeక్రైమ్హైదరాబాద్‌లో ఘోరం: స్నేహితుల చేతిలో యువకుడి హత్య- ప్రైవేట్ పార్ట్స్ పై దాడి చేసి మరీ...

హైదరాబాద్‌లో ఘోరం: స్నేహితుల చేతిలో యువకుడి హత్య- ప్రైవేట్ పార్ట్స్ పై దాడి చేసి మరీ దారుణం

హైదరాబాద్ నగర పరిధిలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. గంజాయి అలవాటు, వ్యక్తిగత విభేదాలు, అలాగే ఓ యువతి విషయంలో తలెత్తిన గొడవలు చివరికి ఒక యువకుడి ప్రాణాలను బలిగొన్నాయి.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, పసుమాముల ప్రాంతానికి చెందిన సుహాస్ (22) అనే యువకుడు గంజాయి వ్యసనానికి లోనై, తన స్నేహితురాలికి అసభ్యకర సందేశాలు పంపుతూ ఉండేవాడు. ఈ విషయం పై స్నేహితుల మధ్య విభేదాలు పెరిగి, ఆగ్రహం హింసకు దారితీసింది.

బుధవారం తెల్లవారుజామున, సుహాస్‌ను అతని స్నేహితులు రాకేష్, పరుశురాం, రాజు తదితరులు ఊరి బయటకు తీసుకెళ్లారు. అక్కడ జరిగిన వాగ్వాదం తీవ్రంగా మారి, అతనిపై అమానుషంగా దాడి చేసి హత్య చేశారు. ప్రైవేట్ పార్ట్స్ పై తీవ్రంగా గాయపరిచి అక్కడికక్కడే వదిలేసి నిందితులు పరారయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు ప్రారంభించి ఒక నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మిగతా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. యువతలో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగం, చిన్న గొడవలు పెద్ద నేరాలకు దారి తీస్తున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

also read: భార్యను కిరాతకంగా హత్య చేసి.. నేరుగా పోలీసులకు లొంగిపోయిన భర్త

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు