Homeతెలంగాణ​భక్తి శ్రద్ధలతో రంజాన్.. ముస్లిం సోదరులకు ఎస్పీ పవార్ శుభాకాంక్షలు

​భక్తి శ్రద్ధలతో రంజాన్.. ముస్లిం సోదరులకు ఎస్పీ పవార్ శుభాకాంక్షలు

•మునుగోడు రోడ్డు ప్రార్థన మందిరం ఈద్గాను సందర్శించి.. భద్రతా ఏర్పాట్ల పరిశీలన

నల్లగొండ,క్రైమ్ మిర్రర్:- రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని నల్లగొండ పట్టణంలోని, మునుగోడు రోడ్డు ప్రార్థన మందిరం ఈద్గాను, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సందర్శించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈద్గా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రార్థన మందిరాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో పండుగను నిర్వహించుకునేందుకు, పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజలందరూ పరస్పర సహకారంతో, శాంతి భద్రతలను కాపాడాలని ఆయన సూచించారు.నెల రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు ఆచరించి, రంజాన్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు, ఎస్పీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పవిత్ర రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం జెన్యూన్ హీరోలు లేరు : తాప్సీ

రంజాన్ వేల ఏపీలో గ్యాస్ కొరత..!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు