హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: హైదరాబాద్ నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ నెయ్యి దందాపై పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు. స్వచ్ఛమైన నెయ్యి పేరుతో నకిలీ ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST), ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన భారీ తనిఖీల్లో సుమారు 36 టన్నుల కల్తీ నెయ్యి, ముడి పదార్థాలు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.
130 తయారీ, విక్రయ కేంద్రాల్లో తనిఖీలు…
Also Read:కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కర్ణాటకకు స్పష్టమైన సూచనలు
హైదరాబాద్ నగరవ్యాప్తంగా మొత్తం 130 కేంద్రాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. వీటిలో 39 నెయ్యి తయారీ యూనిట్లు, 91 నెయ్యి విక్రయ కేంద్రాలు ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం, ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.అధికారుల తనిఖీల్లో కల్తీ నెయ్యి తయారీకి పామాయిల్, వనస్పతి, స్కిమ్డ్ మిల్క్ పౌడర్, స్టార్చ్, కృత్రిమ నెయ్యి సువాసనలు వంటి పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. పాలు, పాల కొవ్వుతో తయారు చేసిన అసలైన నెయ్యి మాదిరిగా కనిపించేలా రుచి, వాసన, రంగును కృత్రిమంగా తీసుకొస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
36 టన్నుల కల్తీ నెయ్యి, ముడి పదార్థాలు సీజ్…
Also Read: బీహార్ లఖిసరాయ్‌లో విషాదం.. తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మృతి
ఈ దాడుల్లో మొత్తం సుమారు 36 టన్నుల కల్తీ నెయ్యి, ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సుమారు 25.5 టన్నుల కల్తీ నెయ్యి, 8.7 టన్నుల క్రీమ్, 1,200 లీటర్ల పామాయిల్, 600 లీటర్ల వనస్పతి, కృత్రిమ నెయ్యి ఫ్లేవర్ల బాటిళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న పదార్థాల నమూనాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రయోగశాల పరీక్షలకు పంపించారు.
‘100% ప్యూర్ గీ’ పేరుతో విక్రయం…
Also Read:కట్టెల తరలింపునకు లంచం.. అటవీ శాఖ అధికారులపై ఏసీబీ కొరడా
కల్తీ నెయ్యిని “100% Pure Ghee”, “Premium Ghee”, “Farm Fresh Ghee”, “Natural Ghee” వంటి పేర్లతో ప్యాక్ చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని ప్యాకెట్లపై తప్పనిసరిగా ఉండాల్సిన బ్యాచ్ లేదా లాట్ నంబర్, FSSAI లైసెన్స్ వివరాలు, తయారీ తేదీ, ప్యాకింగ్ తేదీ, గడువు తేదీ వంటి సమాచారం కూడా లేకపోవడం అధికారులను మరింత ఆందోళనకు గురిచేసింది.
ఇతర రాష్ట్రాల నుంచి ముడి పదార్థాల సరఫరా …
Also Read:పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీకి గుండెపోటు.. యాంజియోప్లాస్టీ
ఈ కల్తీ నెయ్యి తయారీకి ఉపయోగించిన పాల క్రీమ్‌ను మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు PTI నివేదించింది. చౌకైన ముడి పదార్థాలతో తక్కువ ఖర్చులో కల్తీ నెయ్యిని తయారు చేసి, అసలైన నెయ్యిగా అధిక ధరలకు విక్రయిస్తూ భారీగా అక్రమ లాభాలు ఆర్జిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ కల్తీ నెయ్యి హైదరాబాద్‌కే పరిమితం కాకుండా తెలంగాణలోని ఇతర ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు కూడా సరఫరా అయి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. దీంతో ఈ వ్యవహారం మరింత విస్తృతంగా ఉన్నదా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే ఆహార కల్తీపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ల్యాబ్ రిపోర్టుల తర్వాత తదుపరి చర్యలు…
Also Read:బాలీవుడ్ బాద్షా ఇంట్లో పాముల కలకలం.. భయాందోళనలో సిబ్బంది
స్వాధీనం చేసుకున్న కల్తీ నెయ్యి, ముడి పదార్థాల నమూనాలను ప్రయోగశాలలకు పంపించారు. పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాత సంబంధిత తయారీదారులు, విక్రయదారులపై ఆహార భద్రత చట్టాల ప్రకారం తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కేసుల నమోదు ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.ప్రజలు నెయ్యి కొనుగోలు చేసేటప్పుడు ప్యాకెట్‌పై FSSAI లైసెన్స్ నంబర్, తయారీ తేదీ, గడువు తేదీ, బ్యాచ్ వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచించారు.
