Homeఅంతర్జాతీయంభూత‌క‌ణాల‌ను గుర్తించిన భౌతిక శాస్ర్త‌వేత్త‌...హాల్జెన్‌కు నోబెల్‌...!

భూత‌క‌ణాల‌ను గుర్తించిన భౌతిక శాస్ర్త‌వేత్త‌…హాల్జెన్‌కు నోబెల్‌…!

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: విశ్వంలో అనేక ర‌హ‌స్యాలు దాగి ఉన్నాయి. వాటిని చేధించేందుకు మాన‌వుడు ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు యుగ‌యుగాలు చేస్తూనే ఉన్నాడు. గెలాక్సీల‌, న‌క్ష‌త్రాల నుంచి వ‌చ్చే కాంతిని చూసి అర్థం చేసుకోవ‌డం ఒక ఎత్త‌యితే కాంతికి కూడ చిక్క‌ని ర‌హ‌స్యాల‌ను సైతం ప‌ట్టుకోవ‌డం మ‌రొక ఎత్తు. కాగా అలాంటి అసాధ్య‌మైన ప‌నిని సాధ్యం చేసి విశ్వ‌పు అంచుల్లో అత్యంత లోతుల్లో ని ర‌హ‌స్యాల‌ను సైతం బ‌య‌ట‌కు తీసిన ప్ర‌ముఖ భౌతిక శాస్ర్త‌వేత్త ఫ్రాన్సిస్ హాల్జెన్‌కు ఈ ఏడాది 2026 నోబెల్ పుర‌స్కారం ల‌భించింది.

ఐస్‌క్యూబ్‌ న్యూట్రినో అబ్జర్వేటరీ కేంద్రం ఏర్పాటుకు కృషి చేసి, అత్యంత శక్తివంతమైన ఖగోళ న్యూట్రినో(ఆస్ట్రోఫిజికల్‌ న్యూట్రినోలు)లను గుర్తించినందుకు స్టాక్‌హోమ్‌లోని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ 82 ఏళ్ల హాల్జెన్‌కు మంగళవారం ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రకటించింది. విశ్వంలోని అల్లకల్లోల ప్రాంతాల నుంచి భూమి వైపు దూసుకొచ్చే అత్యంత సూక్ష్మమైన ‘న్యూట్రినో’ కణాలను గుర్తించేందుకు ‘ఐస్‌క్యూబ్స ప్ర‌యోగాన్ని విజ‌య‌వంతం చేశారు.

ఏమిటీ ‘భూతకణాలు’.. ఎందుకంత ప్రత్యేకం…?

మన చుట్టూ ఉన్న గాలి, నీరులాగే విశ్వంలో అత్యధికంగా ఉండే కణాలలో న్యూట్రినోలు ఒకటి. వీటికి ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉండదు, ఇతర పదార్థాలతో అసలు చర్య జరపవు. ఉదాహరణకు ప్రతి సెకనుకు కోట్లాది న్యూట్రినోలు మన శరీరంలోంచి, భూమిలోంచి దూసుకెళ్లిపోతుంటాయి, కానీ వాటి ఉనికిని మనం గుర్తించలేం. అందుకే శాస్త్రవేత్తలు వీటిని ‘అదృశ్య కణాలు’ లేదా ‘భూతకణాలు’ (Ghost particles) అని పిలుస్తుంటారు.అయితే, ఇతర కణాల మాదిరిగా అయస్కాంత క్షేత్రాల వల్ల దారి మళ్లకపోవడం ఈ న్యూట్రినోల ప్రత్యేకత. విశ్వంలో ఎక్కడో కొన్ని బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో జరిగే విస్ఫోటనాల వద్ద పుట్టే ఇవి.. నేరుగా తిన్నని రేఖలో ప్రయాణిస్తూ, తాము ఎక్కడ పుట్టాయో చెప్పే కచ్చితమైన సమాచారాన్ని మోసుకొస్తాయి. అందుకే ఇవి విశ్వపు రహస్య సందేశాలను మోసుకొచ్చే ‘గూఢచారులు’గా మారాయి.

అంటార్కిటికా మంచు అడుగున అద్భుత ప్రయోగం! విశ్వపు అత్యంత శక్తివంతమైన ప్రాంతాల నుంచి వచ్చే ఈ న్యూట్రినోలను ఎలా పట్టుకోవాలనే ప్రశ్న దశాబ్దాలుగా శాస్త్రవేత్తలను వేధించింది. దీనికి 1988లోనే ఫ్రాన్సిస్ హాల్జెన్ ఒక విప్లవాత్మక ఆలోచన చేశారు. దక్షిణ ధ్రువంలోని అంటార్కిటికా మంచు పొరలనే ఒక పెద్ద డిటెక్టర్‌గా మార్చాలని ప్రతిపాదించారు. దట్టమైన మంచులోకి కదిలే న్యూట్రినో ఏదైనా అనుకోకుండా మంచు అణువును ఢీకొట్టినప్పుడు స్వల్ప కాంతి వెలువడుతుంది.

ఈ కాంతి వెలుగులను గుర్తించేందుకు ఒక క్యూబిక్ కిలోమీటర్ వైశాల్యంలో, మంచు లోపల వేలాది సెన్సార్లను అమర్చి ‘ఐస్‌క్యూబ్’ పరిశోధనశాలను నిర్మించారు. 2011 నాటికి పూర్తయిన ఈ ఐస్‌క్యూబ్ డిటెక్టర్, మన సౌర కుటుంబానికి వెలుపలి నుంచి వస్తున్న హై-ఎనర్జీ న్యూట్రినోలను విజయవంతంగా గుర్తించి చరిత్ర సృష్టించింది. విశ్వాన్ని చూసే సరికొత్త చూపు! కేవలం కాంతి లేదా టెలిస్కోప్‌ల ఆధారంగా అంతరిక్షాన్ని చూడటమే కాకుండా, న్యూట్రినోల ఆధారంగా విశ్వాన్ని పరిశీలించే ‘న్యూట్రినో ఆస్ట్రానమీ’కి ఈ ప్రయోగం పునాది వేసింది. ఫ్రాన్సిస్ హాల్జెన్ నేతృత్వంలోని అంతర్జాతీయ ఇంజనీరింగ్, పరిశోధక బృందం అందించిన ఈ అద్భుత పరికరం భవిష్యత్తులో అంతరిక్ష మూలాలను తెలుసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తోంది. కాంతితో చూడలేని ప్రదేశాలను కణాల సహాయంతో చూడవచ్చని నిరూపించిన హాల్జెన్ విజనరీ ఐడియాకే నోబెల్ కమిటీ ఈ అత్యున్నత గౌరవాన్ని అందించింది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. గ్రీన్ టీతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు: నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు
  2.  విజయ్‌-రష్మిక ప్రేమకథలో అసలు ట్విస్ట్.. ప్రపోజల్‌ లేకుండానే పెళ్లి వరకు!
  3.  ఏకంగా 15 నిమిషాలు శ్వాస ఆపిన విద్యుత్ జమ్వాల్… సామాన్యులు ప్రయత్నించొద్దు అంటున్న నిపుణులు
  4. ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. 45 ఎకరాలపై ఆరా

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు