Homeజాతీయంఈసీఐ ఓటర్ల జాబితా సవరణపై సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేఖంగా సుప్రీంకోర్టులో పిటిషన్

ఈసీఐ ఓటర్ల జాబితా సవరణపై సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేఖంగా సుప్రీంకోర్టులో పిటిషన్

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ECI)పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఈ పిటిషన్‌లో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఎన్నికల కమిషన్‌లోని ఇతర కమిషనర్ల ఆమోదం లేకుండా తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలను రద్దు చేయాలని పిటిషనర్ కోరారు.

ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి గతంలో అమల్లో ఉన్న ‘ఫారమ్-6’ను తిరిగి ప్రవేశపెట్టాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. అలాగే సుమారు 13 కోట్ల ఓట్ల తొలగింపు వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)తో విచారణ జరిపించాలని కోరారు.

ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు సంబంధిత అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషనర్ అభ్యర్థించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను భద్రపరచడం కూడా అవసరమని పేర్కొన్నారు.

ముఖ్యంగా ERONet సర్వర్‌కు సంబంధించిన లాగ్‌లను భద్రపరచాలని సుప్రీంకోర్టును కోరారు. తద్వారా ఓటర్ల జాబితా మార్పులు, తొలగింపులకు సంబంధించిన డిజిటల్ వివరాలను భవిష్యత్తులో పరిశీలించే అవకాశం ఉంటుందని పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం.

ఈ పిటిషన్‌లో చేసిన ఆరోపణలు, డిమాండ్లపై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా తదుపరి పరిణామాలు వెలువడే అవకాశం ఉంది.

also read: సాంబార్‌లో బల్లి.. 40 మంది విద్యార్థులకు అస్వస్థత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు