Homeక్రైమ్సాంబార్‌లో బల్లి.. 40 మంది విద్యార్థులకు అస్వస్థత

సాంబార్‌లో బల్లి.. 40 మంది విద్యార్థులకు అస్వస్థత

తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో కలకలం చోటుచేసుకుంది. విద్యార్థులకు అందించిన ఉచిత అల్పాహార పథకం భోజనంలో బల్లి కనిపించడంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

శుక్రవారం ఉదయం పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారంలో భాగంగా సాంబార్ వడ్డించారు. అయితే అందులో బల్లి కనిపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే సాంబార్ తిన్న సుమారు 40 మంది విద్యార్థులు వాంతులు, కళ్లు తిరగడం వంటి అనారోగ్య లక్షణాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం.

వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది, అధికారులు అస్వస్థతకు గురైన విద్యార్థులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వారికి చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణకు ఆదేశించారు. పాఠశాలలో ఆహారం తయారీ, సరఫరా ప్రక్రియతో పాటు సాంబార్‌లో బల్లి ఎలా పడిందనే అంశంపై వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

also read: విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు