క్రైమ్ మిర్రర్ : ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో 23 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో పోలీసు శాఖకు చెందిన ఇద్దరు సిబ్బందితో పాటు సీఆర్‌పీఎఫ్‌కు చెందిన మరో ఇద్దరు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో హసన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ సబ్ ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. హర్యానాలోని ఫతేబాద్‌కు చెందిన బాధితురాలు అమ్రోహాలోని పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు ఈ నెల 20న బయల్దేరింది. పరిచయం ఉన్న ఓ మహిళ సూచనతో ఆమె సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ మోహిత్‌ను సంప్రదించింది. మరుసటి రోజు సోనిపట్‌లో మోహిత్‌ను కలిసిన అనంతరం ఇద్దరూ మీరట్‌కు వెళ్లారు. అక్కడ మోహిత్ సహోద్యోగి, సీఆర్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ లాలారామ్ యాదవ్ వారితో చేరాడు.
అనంతరం మోహిత్ తనకు పరిచయమైన పోలీసు అధికారి సంజయ్ తోమర్‌ను కలిసేందుకు అమ్రోహాలోని హసన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో సాధారణ దుస్తుల్లో ఉన్న సంజయ్ వారిని పోలీస్ స్టేషన్ వద్ద కలిశాడు. అక్కడి నుంచి మోహిత్‌కు చెందిన కారులో వారు జుల్‌పురి ఫామ్‌కు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
ఫామ్‌హౌస్‌కు చేరుకున్న తర్వాత రెండు గదులను తీసుకున్నారు. ఒక గదిలో మోహిత్, సంజయ్, లాలారామ్ ఉండగా.. మరో గదిలో బాధితురాలు ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత హెడ్ కానిస్టేబుల్ ప్రమోద్ అక్కడికి వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత నలుగురు మద్యం సేవించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
also read : సాంబార్‌లో బల్లి.. 40 మంది విద్యార్థులకు అస్వస్థత
