Homeజాతీయంస్టాలిన్ కు పన్నీరు సెల్వం షాక్!

స్టాలిన్ కు పన్నీరు సెల్వం షాక్!

-డీఎంకేకు గుడ్ బై చెప్పనున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి
=కుమారుడితో కలిసి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీలోకి
..

క్రైమ్ మిర్రర్, రాజకీయం:-తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర వార్త ఒకటి హల్చల్ చేస్తోంది. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీలో మాజీ సీఎం, సీనియర్ నేత ఓ పన్నీరు సెల్వం, ఆయన కుమారుడు రవీంద్రనాథ్ చేరుతారన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది. గత ఎన్నికలకు ముందు డీఎంకే గూటికి చేరారు ఆయన. అయితే ఆ పార్టీలో చేరి ఆరు నెలలు గడుస్తోంది. అయినా సరే తనతో పాటు తన కుమారుడు కు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన ఆవేదనతో ఉన్నట్లు సమాచారం. డీఎంకే అధినేత పై ఆగ్రహంగా ఉన్న పన్నీరు సెల్వం విజయ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. డీఎంకే లో తమకు సరైన రాజకీయ భవిష్యత్తు కనిపించడం లేదని భావిస్తున్న ఈ తండ్రి కొడుకులు.. త్వరలో డీఎంకేకు గుడ్ బై చెప్పడం ఖాయమన్న ప్రచారం తమిళనాడు పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది.

ఎన్నికలకు ముందు చేరిక..
సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముందు అన్నా డిఎంకె నుంచి డీఎంకే లో చేరారు పన్నీరు సెల్వం. తన సొంత నియోజకవర్గం తేని నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆ నియోజకవర్గంలో డీఎంకే ఎంపీ తంగా తమిళ్ సెల్వన్ హవా నడుస్తోంది. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా తనకు తగిన ప్రాధాన్యం లేకుండా పోతుందని పన్నీరు సెల్వం ఆవేదనతో ఉన్నారు. పార్టీ హై కమాండ్ సైతం ఎంపీకి ప్రాధాన్యం ఇస్తుండడంతో తీవ్ర నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. డీఎంకే లో కొనసాగితే భవిష్యత్తులో ప్రాధాన్యం ఉండదని గ్రహించి.. టీవీకే లో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

తెలంగాణ క్యాబినెట్ విస్తరణ లేనట్టే!

జోరుగా ప్రచారం..
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పన్నీరు సెల్వంతో పాటు ఆయన కుమారుడు పార్టీకి గుడ్ బై చెబుతారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే పన్నీర్ సెల్వం ఈ ప్రచారాన్ని ఖండించారు. డీఎంకే ను వీడి విజయ్ పార్టీలో చేరుతున్నామని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను ఖండించారు. అవి కేవలం పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశారు. రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నారని జరిగే ప్రచారాలు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తాయని.. తమను నమ్ముకున్న ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేయలేమని ఆయన బహిరంగ వ్యాఖ్యలు చేశారు. కానీ ఇంతవరకు ప్రచారాలు మాత్రం ఆగడం లేదు. అయితే ఇప్పుడు కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం పన్నీరు సెల్వం టీవీకే లో చేరేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తమిళ మీడియా వర్గాలు చెబుతున్నాయి. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు