Homeఆంధ్ర ప్రదేశ్తొమ్మిది రోజులైన దొర‌కని చిన్నారి జాను ఆచూకి...!రంగంలోకి ప‌వ‌న్‌

తొమ్మిది రోజులైన దొర‌కని చిన్నారి జాను ఆచూకి…!రంగంలోకి ప‌వ‌న్‌

కాకినాడ, క్రైమ్ మిర్ర‌ర్‌: కాకినాడ జిల్లా తుని మండలంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. : చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఘటన మిస్టరీ ఇంకా వీడడం లేదు. ఆ చిన్నారి అదృశ్యమై ఎనిమిది రోజులు గడుస్తోంది. వందలాది మంది పోలీసులు జల్లెడ పడుతున్నారు. కానీ ఇంతవరకు ఆచూకీ లేదు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనపై ఆరా తీసారు. కాకినాడ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కనుకునేందుకు మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని ఆదేశించారు. గాలింపు చర్యల్లో పోలీస్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎన్టీఆర్ బృందాలను రంగంలోకి దించాలని ఆదేశించారు. దట్టమైన అడవుల్లో సైతం వెళ్ళగలిగే అటవీ శాఖ నైట్ వాచర్స్, బేస్ క్యాంపు వాచర్స్, నిపుణుల సహాయం తీసుకోవాలని సూచించారు.

Also Read:US- Iran Deal: యుద్ధానికి ముగింపు.. ఇరాన్‌ తో డీల్ కుదిరిందన్న ట్రంప్!

పరిసర అటవీ ప్రాంతాల్లో జల్లెడ పట్టాలని కూడా ఆదేశాలు జారీ చేశారు పవన్ కళ్యాణ్.కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీసులు పలుమార్లు గాలింపు చర్యలు చేపట్టినా చిన్నారి ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. చిన్నారి కనిపించకుండా పోయినప్పటి నుంచి ఆమె కోసం అన్ని దిశల్లో అన్వేషణ కొనసాగుతోంది. పాప సురక్షితంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొనగా, చిన్నారి కోసం ప్రభుత్వం, అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Also Read:Bengaluru Murder Case: అనుమానం పెనుభూతమై.. ప్రియురాలిని కడతేర్చిన ఉన్మాది!

చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న అధికారులు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన హనుమాన్ టీం రంగంలోకి దిగింది. నిన్న అర్ధరాత్రి నుంచే అటవీ ప్రాంతాల్లో సెర్చింగ్ ఆపరేషన్ ప్రారంభించిన బృందాలు అడవిలోని ప్రతి ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. చిన్నారి జాడ కోసం పోలీసులు, అటవీశాఖ సిబ్బంది, ప్రత్యేక బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ రెండు థర్మల్ డ్రోన్లను రంగంలోకి దించారు. రాత్రి సమయంలో కూడా స్పష్టమైన సమాచారాన్ని సేకరించేందుకు ఈ డ్రోన్లు సహాయపడుతున్నాయి.

Also Read:Yogi Adityanath: అఖిలేష్ కుమార్తెపై ట్రోలింగ్.. సీఎం యోగి సీరియస్!

డ్రోన్ కెమెరాల ద్వారా అడవిలోని పొదలు, లోయలు, చేరుకోవడం కష్టమైన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అటవీశాఖ అధికారులు, హనుమాన్ టీం సభ్యులు కలిసి విస్తృత స్థాయిలో గాలింపు కొనసాగిస్తున్నారు. చిన్నారి ఎక్కడైనా చిక్కుకుని ఉండొచ్చనే అనుమానంతో ప్రతి ప్రాంతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.అటవీశాఖ అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం, ఆ ప్రాంతంలో మనుషులపై దాడి చేసే క్రూర జంతువులు ఉండే అవకాశం చాలా తక్కువగా ఉందని చెబుతున్నారు.

Also Read:Divorce Cancelled: విడాకుల కోసం వెళ్లిన దంపతులు కోర్టులోనే ఒక్కటయ్యారు.. జడ్జి ముందే హ్యాపీ ఎండింగ్!

దీంతో చిన్నారి క్షేమంగా ఉండే అవకాశాలపై ఆశాభావం వ్యక్తమవుతోంది. అయినప్పటికీ ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టకుండా అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం కొనసాగుతున్న ఈ సెర్చ్ ఆపరేషన్‌పై స్థానిక ప్రజలు, కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే పాప జాడ లభించాలని అందరూ ప్రార్థిస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు