Homeతెలంగాణగంగన్నగూడ హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించిన ఎమ్మెల్యే...!

గంగన్నగూడ హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించిన ఎమ్మెల్యే…!

  • బ్రిడ్జి ప్రారంభోత్సవంతో గ్రామంలో సంబరాలు

షాద్‌న‌గ‌ర్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: రూ.1.25 కోట్ల హెచ్‌ఎండీఏ నిధులతో నిర్మించిన గంగన్నగూడ హై లెవెల్ బ్రిడ్జిని షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా గ్రామంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ, వర్షాకాలంలో గ్రామ ప్రజలు రాకపోకల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని, ఈ హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణంతో ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని తెలిపారు.

Also Read:Indian Win: స్మృతి బ్యాటింగ్ మెరుపులు.. దీప్తి బౌలింగ్ మాయాజాలం.. పాక్‌ను చిత్తు చేసిన భారత్!

గంగన్నగూడ గ్రామం నుంచి అనేక గ్రామాలకు రాకపోకలు సాగుతున్న నేపథ్యంలో ప్రజల అవసరాలను గుర్తించి, అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఈ పనిని పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్నామని, ప్రజా సమస్యల పరిష్కారం మరియు అభివృద్ధే తన ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Also Read:US- Iran Deal: యుద్ధానికి ముగింపు.. ఇరాన్‌ తో డీల్ కుదిరిందన్న ట్రంప్!

తాజావార్తలు