Homeవైరల్లిక్కర్ షాపులోకి కోతి.. మద్యం తాగి అక్కడే మత్తులో నిద్ర! వైరల్‌గా మారిన ఘటన

లిక్కర్ షాపులోకి కోతి.. మద్యం తాగి అక్కడే మత్తులో నిద్ర! వైరల్‌గా మారిన ఘటన

ఝార్ఖండ్‌లో జరిగిన ఓ వింత ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా కోతులు ఆహారం కోసం ఇళ్లలోకి, దుకాణాల్లోకి రావడం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఓ కోతి ఏకంగా మద్యం దుకాణంలోకి వెళ్లి, అక్కడ ఉన్న మద్యం సేవించి అనంతరం షాపులోనే నిద్రపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ ఘటన రాంచీ సమీపంలోని ఓర్మాంఝి బ్లాక్ చౌక్ ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు సమాచారం. ఓ ఆడ కోతి అకస్మాత్తుగా స్థానికంగా ఉన్న మద్యం దుకాణంలోకి ప్రవేశించింది. మొదట షాపులోని వస్తువులను పరిశీలిస్తూ అటూ ఇటూ తిరిగిన ఆ కోతి.. కొద్దిసేపటి తర్వాత అక్కడ ఉన్న ఓ మద్యం బాటిల్‌ను చేతిలోకి తీసుకుంది.

ఆ తర్వాత బాటిల్‌లోని మద్యాన్ని తాగినట్లు స్థానికులు తెలిపారు. మద్యం సేవించిన కొద్దిసేపటికే కోతి షాపులోని ఓ మూలకు వెళ్లి పడుకుంది. దీంతో షాపు సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కోతిని బయటకు పంపేందుకు ప్రయత్నించినప్పటికీ అది కదలకుండా నిద్రపోవడంతో ఏం చేయాలో వారికి అర్థం కాలేదు.

ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాలకు తెలియడంతో పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. కోతి మద్యం తాగి నిద్రపోతున్న దృశ్యాన్ని చూసి పలువురు ఆశ్చర్యపోయారు. కొందరు ఈ ఘటనను తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేయడంతో విషయం మరింతగా వైరల్‌గా మారింది.

సమాచారం అందుకున్న రెస్క్యూ బృందం అక్కడికి చేరుకుని కోతిని సురక్షితంగా బయటకు తీసేందుకు చర్యలు చేపట్టింది. మత్తులో ఉన్న కోతిని జాగ్రత్తగా అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించినట్లు సమాచారం.

మద్యం దుకాణంలోకి ప్రవేశించడం, బాటిల్‌లోని మద్యం తాగడం, అనంతరం అక్కడే నిద్రపోవడం వంటి కోతి ప్రవర్తన స్థానికులకు ఒకవైపు ఆశ్చర్యాన్ని కలిగించగా.. మరోవైపు నవ్వులు తెప్పించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

also  read:  విజయవాడలో కల్యాణి హత్య కేసు ఛేదింపు.. షఫీ అబ్దుల్లా అరెస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు