HomeతెలంగాణTG ICET- 2026: టీజీ ఐసెట్ 2026కు సర్వం సిద్ధం: కన్వీనర్ ఆచార్య అల్వాల రవి

TG ICET- 2026: టీజీ ఐసెట్ 2026కు సర్వం సిద్ధం: కన్వీనర్ ఆచార్య అల్వాల రవి

క్రైమ్ మిర్రర్, నల్లగొండ బ్యూరో: ఎంబీఏ,  ఎంసీఏ కోర్సులలో అడ్మిషన్ కోసం నిర్వహించే ఐసెట్ 2026ను రెండవ పర్యాయం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నిర్వహించనున్నట్లు కన్వీనర్ ఆచార్య అల్వాల రవి తెలిపారు. మే 13, 14వ తారీకుల్లో మూడు విడతల్లో నిర్వహించనున్న టీజీ ఐసెట్ కు 56223 మంది విద్యార్థుల్లో 30308 మంది మహిళలు,  25915 మంది పురుషులు, దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

మే 13, 14 తేదీల్లో పరీక్షలు

మే 13న మొదటి స్పెషల్ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, రెండవ స్పెషన్ మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:00 వరకు,  14 మే మొదటి సెషన్ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించనున్నారు. దివ్యాంగులు మరియు ఉర్దూ విద్యార్థులకు మే 13 మధ్యాహ్నం 2వ సెషన్లో పరీక్ష నిర్వహించనున్నారు.

69 కేంద్రాలలో పరీక్షల నిర్వహణ

పరీక్ష మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 16 రీజినల్ సెంటర్లలో,  69 పరీక్షా కేంద్రాలలో నిర్వహించనున్నట్లు 100 పరిశీలకులతో పారదర్శకంగా నిర్వహించనున్నట్లు చేసినట్లు ఆయన తెలిపారు.  మొదటి సెషన్ విద్యార్థులు ఉదయం 8:30 నుండి, రెండవ సెషన్ ఒకటిన్నర నుండి  పరీక్ష  హాలులోకి అనుమతిస్తారు,  మొదటి సెషన్ విద్యార్థులు 9:45 నిమిషాల తర్వాత , రెండవ సెషన్ విద్యార్థులకు 1:45 నిమిషాల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరని వెల్లడించారు.

పరీక్షల కోసం పకడ్బందీ ఏర్పాటు

పరీక్షా నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఆచార్య అల్వాల రవి తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్షలకు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించాలని ఆయన సూచించారు. ఈసారి ఐసెట్ పరీక్షలను మరింత కట్టుదిట్టంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు