క్రైమ్ మిర్రర్, విశాఖపట్నం: ఏపీలో పర్యాటక ప్రాంతం అంటే ముందుగా గుర్తొచ్చేది విశాఖపట్నం. సుందరమైన నగరంగా విశాఖకు ఎంతో ప్రత్యేకత ఉంది. సువిశాల స్థిర ప్రాంతం, ఆ పైతివాచీ పరిచినట్టు పచ్చదనం.. అందమైన మన్య ప్రాంతం విశాఖ జిల్లా సొంతం. ఇప్పటికే చూడ చక్కటి పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. పర్యాటకంగా కూడా సాగరనగరం ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టు కేటాయింపుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. మరోవైపు విశాఖ నగరాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలని విశాఖ మెట్రోపాలిటన్ రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
సమీకృత సాహస కారిడార్ గా…
Also Read:బీడీ కార్మికుల పిల్లలకు గుడ్ న్యూస్… 2026-27 స్కాలర్షిప్స్ కోసం అప్లై చేసారా?
సింగపూర్ లోని ప్రసిద్ధ మాందాయ్ వైల్డ్ లైఫ్ రిజర్వ్ ను ఆదర్శంగా తీసుకుని నైట్ సఫారీ, జంగిల్ సఫారీలను అభివృద్ధి చేయాలని విఎంఆర్డిఏ నిర్ణయించింది. భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా కైలాసగిరి, ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాల, కంబాలకొండ రక్షిత అటవీ ప్రాంతాలను ఒకే సమీకృత సాహస కారిడార్ గా మార్చనున్నారు. అదే జరిగితే దేశంలోనే విశాఖ పర్యాటకంగా మరింత గుర్తింపు సాధిస్తుంది. ప్రస్తుతం కైలాసగిరి, జూలాజికల్ పార్క్ ప్రాంతాలను, కంబాలకొండ అడవితో అనుసంధానం చేసి.. వన్యప్రాణి సంరక్షణ, ఎంటర్టైన్మెంట్ తో పాటు పర్యావరణ అభివృద్ధిని ఒకేసారి సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది.
భారీ అక్వేరియం ఏర్పాటు…
Also Read:పారిశ్రామికవేత్త కేతన్ హత్య కేసులో కీలక పరిణామం…!తప్పు చేస్తే ఉరితీయాలన్న తల్లి…
ఈ అరుదైన ప్రాజెక్టులో వైవిధ్యమైన జంతువులు, పక్షులు, జలచరాలతో కూడిన భారీ అక్వేరియం, రాత్రి సమయంలో సఫారీలు, జంగిల్ సాహసాలు, రైన్ ఫారెస్ట్ అడ్వెంచర్స్ వంటి అనేక ఆకర్షణలను ఏర్పాటు చేయనున్నారు. సింగపూర్ తరహాలో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దనున్నారు. తద్వారా భారీగా ఆదాయం సమకూర్చుకోవాలన్నదే లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు ముందడుగు వేశారు. టెండర్ ప్రక్రియలో కొన్ని రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ బెంగళూరుకు చెందిన ఇంటిగ్రేటెడ్ డిజైన్ సంస్థ, సింగపూర్ కు చెందిన మాందాయ్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మాణానికి ముందుకు వచ్చాయి. ఇప్పటికే విశాఖ నగరంలోని మూడు ప్రాంతాలను చూసి అధ్యయనం చేశాయి. విఎంఆర్డిఏతో అవగాహన ఒప్పందం కుదుర్చుకొని ప్రాజెక్టు డిజైన్, పనుల వేగవంతం పై దృష్టిపెట్టాయి. మొత్తానికి అయితే ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే పర్యాటకంగా విశాఖ నగరం దేశంలోనే అగ్ర జాబితాలో చేరనుంది.
Also Read:ఇలాంటి దర్శకుడిని ఎప్పుడు చూడలేదు…!ఒక్క షాట్ కోసం 94 టేకులు…