Homeఆంధ్ర ప్రదేశ్భోగాపురం విమానాశ్ర‌యం రెడీ..!

భోగాపురం విమానాశ్ర‌యం రెడీ..!

  • జూలై 5న జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:ఏపీకి మరో గుడ్ న్యూస్ అందింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది. జూలై 5న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అత్యంత వైభవంగా ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి తుది అధికారిక ఆమోదం కోసం రాష్ట్ర అధికార యంత్రాంగం వేచి చూస్తోంది. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జూలై 8 నుంచి పూర్తిస్థాయిలో విమాన రాకపోకలు ప్రారంభం అవుతాయి ఇప్పటికే అంతర్జాతీయ విమానయాన సంస్థ స్కూట్ జూలై 8 నుంచి సింగపూర్ కు తన తొలి సర్వీసును నడపనున్నట్లు ఇదివరకే ప్రకటించింది.

ట్రయల్ రన్ సక్సెస్…

Also Read:ఘనంగా ‘రొట్టెల పండుగ’ ప్రారంభం… దేశం నలుమూలల నుంచి భక్తుల రద్దీ!

ఇప్పటికే ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రయల్ రన్ పూర్తయింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తో పాటు పౌర విమానయాన శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాగా.. సేఫ్ గా ల్యాండ్ అయింది. ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. అయితే చిన్నచిన్న పెండింగ్ పనులు పూర్తయ్యేందుకు రెండు నెలలపాటు సమయం పట్టింది. ఇప్పుడు ప్రారంభ గడువు సమీపిస్తుండడంతో శరవేగంగా రూపుదిద్దుకుంటుంది ఎయిర్పోర్ట్ ప్రాంగణం. మరోవైపు దేశీయ విమానయాన సంస్థలు తమ సర్వీసులను విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు మార్చేందుకు అన్ని ప్రయత్నాలు చేసుకుంటున్నాయి. జూన్ 9 నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ పూర్తిగా నావి ఆధీనంలోకి వెళ్లిపోనుంది. ఇకనుంచి పౌర విమానయాన సేవలన్నీ భోగాపురం ఎయిర్పోర్ట్ కు పరిమితం కానున్నాయి.

విభజన హామీల్లో భాగంగా…

Also Read:కూట‌మి ప్ర‌భుత్వానికి ఇంట‌ర్వెల్ పూర్త‌యింది…! అమర్ నాథ్ వ్యాఖ్యలు వైర‌ల్‌…

రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా 2014లో ఏపీకి ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. అలా రూపుదిద్దుకున్నదే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. జిఎంఆర్ గ్రూపు అత్యంత ప్రతిష్టాత్మకంగా పిపిపి విధానంలో సుమారు 2200 ఎకరాల విస్తీర్ణంలో.. 5000 కోట్ల రూపాయల వ్యయంతో ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించింది. మొదటి దశలో ఈ ఎయిర్పోర్ట్ ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా.. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో రూపుదిద్దుకుంది. 77 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన టెర్మినల్ భవనంలో.. ప్రయాణికుల సౌకర్యార్థం 40 చెక్ ఇన్ కౌంటర్లు, 26 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రయాణికుల టిక్కెట్ల పై వసూలు చేసే యూజర్ డెవలప్మెంట్ ఫీజు రిఫ్ ను కూడా ఖరారు చేశారు.

ఉత్తరాంధ్ర చిరకాల వాంఛ…

Also Read:బీడీ కార్మికుల పిల్లలకు గుడ్ న్యూస్… 2026-27 స్కాలర్‌షిప్స్ కోసం అప్లై చేసారా?

ఉత్తరాంధ్ర ప్రజలు దశాబ్దాలుగా ఎయిర్పోర్ట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కేవలం ఉత్తరాంధ్ర మాత్రమే కాకుండా ఒడిస్సా, చత్తీస్గడ్ ప్రజలు సైతం రాకపోకలు సాగించే వీలుగా ఎయిర్పోర్ట్ ను తీర్చిదిద్దారు. ప్రయాణికులకు ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా విశాఖ నగరం నుంచి ఎయిర్పోర్ట్ కానుసంధానించే నేషనల్ హైవే రోడ్డు కారిడార్ పనులను కూడా యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్రలో ఐటీ రంగంతో పాటు పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా మెరుగు పడనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు