Homeఆంధ్ర ప్రదేశ్పవన్ కళ్యాణ్ చతుర్మాస దీక్ష...! సాత్విక ఆహారం, సాధారణ జీవనం..

పవన్ కళ్యాణ్ చతుర్మాస దీక్ష…! సాత్విక ఆహారం, సాధారణ జీవనం..

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లో ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. ఆయన తరచూ ఆలయాల సందర్శన, వివిధ రకాల దీక్షలు చేపడుతుంటారు. గత రెండు సంవత్సరాలుగా ఆయన దీక్షలు చేస్తూ వస్తున్నారు. తాజాగా చతుర్మాష దీక్షను ప్రారంభించారు. జేష్ట మాసంతో ప్రారంభమయ్యే ఈ దీక్ష 120 రోజులపాటు కొనసాగుతుంది. అనంతరం కార్తీక మాసంలో దీనిని ముగిస్తారు. తాజాగా ఈ దీక్షను ప్రారంభించారు పవన్ కళ్యాణ్. చందన వస్త్రధారణలో దీక్షకు పూనారు. బుధవారం మంగళగిరిలోని పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. అప్పటికి ఆయన దీక్ష వస్త్రాలు ధరించారు. పూజల అనంతరం ధ్యానం చేసిన తర్వాత… తిరిగి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక గదిలో ఈ దీక్ష శిబిరం కొనసాగించనున్నారు.

గతంలో చాలాసార్లు…

Also Read:ఇలాంటి ద‌ర్శ‌కుడిని ఎప్పుడు చూడ‌లేదు…!ఒక్క షాట్ కోసం 94 టేకులు…

గతంలో కూడా పవన్ కళ్యాణ్ చతుర్మాష దీక్షను చేపట్టారు. ఇప్పుడు తాజాగా మరోసారి శ్రీకారం చుట్టారు. దీక్ష సమయంలో పవన్ కళ్యాణ్ కుటుంబానికి దూరంగా ఉంటారు. సాత్విక ఆహారమే తీసుకుంటారు. పాలు, పండ్లు, ఉడికించిన కూరగాయలు వంటివి మితంగా తీసుకుంటారు. వస్త్రధారణలోనూ జాగ్రత్తలు పాటించనున్నారు. ఎరుపు రంగు అంచుతో కూడిన చందన వర్ణ దుస్తులను ధరించనున్నారు. ప్రతిరోజు దేవతారాధన, ధ్యానంలో నిమగ్నం అవుతారు. దీక్షా సమయంలో గురుముఖత నేర్చుకున్న మంత్ర పఠనం కి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

వారాహి యాత్ర విజయవంతం…

Also Read:తెలంగాణ సీఎస్‌గా సంజ‌య్ జుజు…!

గతంలో చాలాసార్లు దీక్షలు చేపట్టారు. జనసేన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేపట్టిన వారాహి యాత్ర ఎంతగానో విజయవంతం అయింది. అధికారంలోకి వచ్చిన తరువాత.. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. తిరుమల కాలినడకన వెళ్లి మొక్కు తీర్చుకున్నారు. ఆ సమయంలోనే అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్యం పై ప్రభావం చూపింది. అయినా సరే దీక్షలు కొనసాగిస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఆయన దక్షిణాది రాష్ట్రాల్లో ఆలయాలను సందర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు మరోసారి చతుర్మాస దీక్ష చేపడుతుండడం విశేషం. కాగా కార్తీక మాసం వరకు ఈ దీక్ష కొనసాగనుంది.

Also Read:బాలయ్య చిన్న కుమార్తె పొలిటికల్ ఎంట్రీ…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు