క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : మంచు ఫ్యామిలీలో మోహన్ బాబు మరియు మనోజ్ మధ్య గొడవలు ఇవాళ తారా స్థాయికి చేరుకున్నాయి. అయితే వీళ్ళిద్దరి మధ్య గొడవ గురించి తాజాగా వాళ్ళింట్లో పనిచేసేటువంటి పనిమనిషి అసలు విషయాలను పాయింట్ టు పాయింట్ వైస్ గా చెప్పుకొచ్చింది. అయితే చెప్పిన వెంటనే ఒత్తిడి కారణంగా తను కూడా ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం కూడా చేసిందట. అయితే అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మొత్తం కూడా పొల్లు పోకుండా చెప్పింది.
Read More : ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని అరెస్ట్?
ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో జరిగే గొడవలు అన్నీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో హైలెట్గా మారిపోయాయి. మోహన్ బాబు ఇంట్లో పని చేసే పనిమనిషి కెమెరా ఉన్నా కానీ లేదనుకొని మొత్తం నిజాలు బయటకు చెప్పింది. ఆమె చెప్పినటువంటి నిజాలు అన్నీ కూడా హైలెట్ కావడంతో వెంటనే ఆమె ఆత్మహత్య కు ప్రయత్నించిందట. మోహన్ బాబు సిబ్బంది అయినా ప్రసాదును మంచు మనోజ్ కొట్టడానికి ఇంటికి వచ్చాడట. ఈ క్రమంలో ప్రసాద్ ను కొట్టొద్దు అంటూ మోహన్ బాబు అడ్డు వచ్చారని చెప్పుకొచ్చింది. ఇక ఈ సందర్భంలోనే ఒకరినొకరు నెట్టుకోవడం జరిగిందని ఎటువంటి దెబ్బలు తగలలేదని అన్నారు.
Read More : పట్టణాల నుండి గ్రామాలకు పాకిన సైబర్ స్కామ్స్!… జాగ్రత్త?
ఇక విష్ణు మరియు మంచు మనోజ్ మధ్య కూడా మనస్పర్ధలు ఉన్నాయని ఆమె చెప్పడంతో అందరూ కూడా షాక్ అయ్యారు. అయితే మంచు మనోజ్ మౌనికని పెళ్లి చేసుకోవడం ఇంట్లో ఎవరికి కూడా ఇష్టం లేదని తద్వారా ఇంట్లో గొడవలు మొదలయ్యాయని చెప్పుకొచ్చింది. ఇక ఇటువంటి సందర్భంలోనే అందరూ కూడా ఆస్తులు అనె విషయాన్ని లేవనెత్తుతున్నారని చెప్పింది. దీంతో ఈమె చెప్పినటువంటి ఈ సమాచారం అంతా కూడా వైరల్ అవ్వడంతో ఆ ఒత్తిడి తట్టుకోలేక పనిమనిషి కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నదట.