Homeతెలంగాణమల్లారెడ్డి పక్కా స్కెచ్...!

మల్లారెడ్డి పక్కా స్కెచ్…!

బిజెపిలో చేరిక విషయంలో వ్యూహాత్మకంగా..

గులాబీ పార్టీ పై గౌరవం ఉందని ప్రకటించిన ప్రీతి రెడ్డి

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: మల్లారెడ్డి బిజెపిలో చేరుతారా? అయితే ఎప్పుడు చేరుతారు? ఆయన నేరుగా చేరుతారా? లేకుంటే కోడలు ప్రీతి రెడ్డిని ముందుగా పంపిస్తారా? తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. ఇటీవల మల్లారెడ్డి తన కోడలితో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీలో ఎంట్రీ పై రకరకాల చర్చ నడుస్తోంది. అయితే బిజెపిలో చేరికను ఖండించలేరు కానీ.. గులాబీ పార్టీ పై గౌరవం ఉందంటూ చెప్పడం ద్వారా ఈ ప్రచారానికి చెక్ పెట్టారు మల్లారెడ్డి. కానీ ఆ ఫ్యామిలీ ఎప్పటికైనా బిజెపి గూటికి చేరడం ఖాయమని తెలంగాణలోని పొలిటికల్ విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు.

ప్రధానిని కలిసాక కూడా..
ఎప్పుడైతే ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా కలిశారో అప్పుడే మల్లారెడ్డి ఫ్యామిలీ కాషాయ గూటికి చేరడం ఖాయం అని తేలిపోయింది. అయితే బిజెపిలో చేరుతానన్న ప్రచారానికి తెలివిగా చెప్పి పెట్టారు మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి. బిజెపి కార్యాలయానికి వెళ్లి మరి చర్చలు జరిపారు. కానీ ఇప్పుడు బీజేపీలో చేరడం లేదని చెప్పడం ద్వారా తన తెలివితేటలను ప్రదర్శించారు. నిజానికి ఆమె ఏ పార్టీలోనూ లేరు. అసలు రాజకీయాల్లోనే లేరు. కానీ మల్లారెడ్డి మాత్రం మాజీ మంత్రి. గులాబీ పార్టీ ఎమ్మెల్యే. ఒకవైపు ఆ పార్టీకి దూరంగా ఉంటూనే.. చాలా గౌరవం ప్రదర్శిస్తూ వచ్చారు కెసిఆర్ పట్ల. మరోసారి రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నానని కూడా చెప్పుకొచ్చారు. కానీ దేనిపై కూడా ఫుల్ క్లారిటీ లేదు. ఇప్పుడు బిజెపి అగ్ర నాయకత్వాన్ని కలిసి బిజెపిలో చేరడం లేదని చెప్పడం ద్వారా తన తెలివితేటలను ప్రదర్శించారు మల్లారెడ్డి..

ఎంపీ అభ్యర్థిగా కోడలు..
వచ్చే ఎన్నికల్లో మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి బిజెపి తరఫున ఎంపీగా బరిలో దిగడం ఖాయం. రాజకీయ వర్గాల్లో కూడా దీనిపై క్లారిటీ ఉంది. అయితే బిజెపి అగ్రనేతలతో చర్చలు జరిపి.. పార్టీ చేరికకు సంబంధించి ఇంకా ముహూర్తం ఖరారు చేయకపోవడం చూస్తుంటే తెరవెనుక వ్యూహం ఉన్నట్లు అర్థమవుతోంది. తన కోడలు ప్రీతి రెడ్డితో మల్లారెడ్డి మాట్లాడిస్తున్నారు. ఆమె గులాబీ పార్టీ నాయకత్వం పై గౌరవం అన్న పదాన్ని వాడుతూనే ఆ పార్టీలో కొనసాగుతామని మాత్రం ప్రత్యేకంగా చెప్పడం లేదు. ఇప్పటికే మల్లారెడ్డి ఫ్యామిలీ ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంది. ప్రీతి రెడ్డి ద్వారా బిజెపి తో తమ ప్రయాణం అని ఆ ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చింది. అయితే గులాబీ పార్టీ ఎమ్మెల్యేగా మల్లారెడ్డి కొనసాగుతున్న నేపథ్యంలో.. చాలా తెలివిగా వ్యవహరిస్తోంది ఆ ఫ్యామిలీ. ఇప్పటికిప్పుడు బిజెపిలో కలవకపోయినా ఆ పార్టీ మల్లారెడ్డి ఫ్యామిలీని మాత్రం ఓన్ చేసుకునే పనిలో పడింది. తద్వారా మూడు కోణాల్లో రాజకీయం చేశారు మల్లారెడ్డి. ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం తన జోలికి రాకపోవడం, గులాబీ పార్టీ సాఫ్ట్ కార్నర్ తో ఉండడం, భవిష్యత్తులో బిజెపి ఆప్షన్ ఉంచేలా చేసుకోవడం వంటివి పగడ్బందీగా ప్రణాళిక వేసి అమలు చేస్తున్నారు మల్లారెడ్డి. తెలంగాణలో బిజెపి మిషన్ ప్రారంభించాక మల్లారెడ్డి ఫ్యామిలీ తమ మార్కు రాజకీయాన్ని ప్రారంభిస్తుందన్న మాట.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు