Homeఆంధ్ర ప్రదేశ్ఏపీలో లోకల్‌ హీట్‌.. కేడర్‌కు అధినేతల దిశా నిర్ధేశం.!

ఏపీలో లోకల్‌ హీట్‌.. కేడర్‌కు అధినేతల దిశా నిర్ధేశం.!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. కొద్ది రోజుల్లో పంచాయతీలు, ఎంపీటీసీతోపాటు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు చెందిన అధినేతలు తమ పార్టీ కేడర్‌కు ఈ మేరకు దిశా, నిర్ధేశం చేస్తున్నారు. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. స్థానిక సంస్థలు ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమష్టిగా పని చేసి విజయం సాధించాలని, ఈ మేరకు సన్నద్ధం కావాలని స్పష్టం చేశారు. అలాగే, పార్టీ ముఖ్య నాయకులతో బుధవారం సమావేశాన్ని నిర్వహించిన వైసీపీ అధినేత జగన్‌ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు నిర్వహించే ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవం కాకుండా చూడాలని పార్టీ ముఖ్య నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకు అండగా ఉండాలని కూడా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు ఆయన సూచించారు. అలాగే, రెండు రోజులు కిందట జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని స్పష్టం చేశారు.

  • ఎన్నికల మూడ్‌లోకి కేడర్‌..

మూడు పార్టీలకు చెందిన అగ్ర నాయకులు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించడంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ఎంతో మంది నాయకులు తమ ప్రయత్నాలను ప్రారంభించారు. తాజా ప్రకటనలతో గ్రామ స్థాయిలో ఎన్నికల వేడి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో అక్టోబరు, నవంబరులో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ఎప్పటి నుంచే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడతోపాటు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మాజీ సీఎం జగన్‌ కూడా కేడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేసేలా కామెంట్లు చేయడంతో ఈ ప్రక్రియ మరింత వేగంగా కదిలే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఏది ఏమైనా కొద్ది రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికల వేడి నెలకొంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ఆయా పార్టీలకు చెందిన నాయకులు సన్నద్ధం అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు