మునుగోడు,క్రైమ్ మిర్రర్:- ప్రతి రోజు సాయంత్రం 6 లోపు వైన్ షాపుల పర్మిషన్ రూములలో ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైన్ షాపులను పరిశీలించి మరో మారు వైన్ షాప్ నిర్వాహులకు స్పష్టం చేశారు. వైన్ షాపుల సమయపాలన నిర్వహణ తీరును పరిశీలించారు. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని హైదరాబాద్ రోడ్ లో ఉన్న వైన్ షాప్ వద్ద ఆగి ఎమ్మెల్యే పరిసరాలను పరిశీలించారు. సాయంత్రం 6 గంటల వరకు పర్మిట్ రూమ్ లో గాని చుట్టు పరిసరాల ప్రాంతాల్లో ఎవ్వరు కూడా మందు తాగొద్దని వైన్ షాప్ నిర్వాహకులకు మరో మారు గట్టిగా చెప్పారు. వైన్ షాపుల సమయపాలన నిర్వహణను పకడ్బందీగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
వైన్స్ షాపులపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరికలు
By Vengal Reddy
0
289
Previous article
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.
పాలిటిక్స్, టెక్నాలజీ, లైఫ్ స్టైల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
