Homeతెలంగాణదీపారాధనకు నోచుకోని ఆల‌యం.. గుప్తనిధులకు అడ్డాగా మారిందా..?

దీపారాధనకు నోచుకోని ఆల‌యం.. గుప్తనిధులకు అడ్డాగా మారిందా..?

  • గుడికి పూర్వ‌వైభ‌వం తీసుకొస్తా

  • ఆధ్యాత్మిక వాతావ‌ర‌ణం నెల‌కొల్పుతా

  • స్పందించిన 4వ వార్డుకౌన్సిల‌ర్ యాద‌య్య‌

యాదాద్రి, క్రైమ్ మిర్ర‌ర్: వందేళ్ల‌ చ‌రిత్ర క‌లిగిన పురాత‌న‌ ఆలయం నేడు శిథిలావ‌స్థ‌కు చేరి క‌నీసం దీపారాద‌న‌కు నోచుకోవ‌డం లేదంటూ సోషల్ మీడియాలో వ‌చ్చిన సందేశం ప్ర‌తి ఒక్క‌రిని క‌దిలించింది… ఆలోచింప చేసింది.

వివ‌రాల్లోకి వెళితే చౌటుప్ప‌ల్ మున్సిపాలిటి ప‌రిధిలోని తంగ‌డ‌ప‌ల్లి గ్రామంలో పురాత‌న శ్రీ వెంక‌టేశ్వ‌ర ఆల‌యం ఎంతో మంది భ‌క్తుల‌తో కిటకిటలాడేది కాగా నేడు గుడి నిర్వ‌హ‌ణ విస్మ‌రించ‌డంతో దీపారాద‌న చేయ‌డం కూడ మానేశారు. కానీ ఇప్పుడు గుప్తా నిధులకోసం ఆలయంలో దుండగులు తవ్వకాలు నిర్వహించారు..

అయితే సంఘటన సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో గ్రామ‌స్తుల్లో ప్ర‌ధాన చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీంతో చౌటుప్ప‌ల్ మున్సిపాలిటి 4వ వార్డు కౌన్సిల‌ర్ ఉద‌రి యాదయ్య స్పందించి గుడి బాధ్య‌త‌లు తీసుకున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు.

ఆల‌యానికి పూర్వ‌వైభ‌వం తీసుకొస్తా…

శిథిలావ‌స్థ‌కు చేరిన శ్రీ‌వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యాన్ని పునరుద్ద‌రించి పూర్వ‌వైభ‌వం తీసుకొస్తాన‌ని 4వ వార్డు కౌన్సిల‌ర్ ఉద‌రి యాద‌య్య అన్నారు. గుడిలో దీపారాధ‌న‌, నైవేద్యాల‌తో మ‌ళ్లీ ఆధ్యాత్మిక వాతావ‌ర‌ణం క‌లిగేలా గ్రామ‌స్తుల‌తో క‌లిసి ప‌ని చేస్తాన‌న్నారు.

అదే విధంగా జాత‌ర నిర్వ‌హించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. మ‌న ఊరి సంతోషం, ప్ర‌జ‌ల కోసం నేను ఎప్ప‌డు సేవ చేయ‌డానికిసిద్దంగా ఉంటాన‌ని తెలిపారు. అదే విధంగా భ‌క్తులు, గ్రామ పెద్ద‌లు ఆల‌య అభివృద్దికి ముందుకు రావాల‌ని కోరారు.

త్వ‌ర‌లోనే ఆల‌యానికి అభివృద్ది ప‌నుల‌తో పాటు దీపారాద‌న పునఃప్రారంభించేలా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని తెలిపారు. ఈ నిర్ణ‌యాన్ని గ్రామ‌స్తులు స్వాగ‌తిస్తూ ఆల‌యం తిరిగి ఆధ్యాత్మిక శోభ‌తో వెలుగొందాల‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు