పల్నాడు జిల్లాలో ఓ ఎస్ఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. కారంపూడి పోలీస్ స్టేషన్ ఎస్ఐ వాసును సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో తమను ఎస్ఐ వేధించారని గాదేవారిపల్లెకు చెందిన దంపతులు ఆరోపించారు.
బాధితుడు చల్ల అయ్యప్ప మాట్లాడుతూ.. ఎస్ఐ తమపై దురుసుగా ప్రవర్తించారని, తనను శారీరకంగా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. అలాగే తన భార్య పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన తన భార్య లక్ష్మి పురుగుల మందు తాగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బయటకు రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు.
ఘటనపై ప్రాథమిక విచారణ అనంతరం ఎస్ఐ వాసుపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వ్యవహారంపై మరింత విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం.
also read: ఎయిర్ పోర్ట్ ఎఫెక్ట్…! ఆ 30 గ్రామాలకు కనెక్టివిటీ కట్…
