Homeతెలంగాణకల్వకుంట్ల కవిత కొత్త ప్రయోగం...!

కల్వకుంట్ల కవిత కొత్త ప్రయోగం…!

  • సామాన్యులే టార్గెట్ గా రాజకీయం

  • సెంటిమెంట్ కాకుండా ప్రజల మద్దతు కోసం ఆరాటం

  • ప్రజా రాజకీయాలతో ముందడుగు వేసేందుకు ప్రయత్నం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పొలిటికల్ సీన్ మారింది. ఇప్పటివరకు ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ నడిచింది. తెలంగాణ రాజకీయ అవకాశాలతో పాటు ఇతరత్రా అంశాలను హైలెట్ చేస్తూ రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ది పొందాయి. అయితే వీటికి కాలం చెల్లిపోయింది.

కేవలం సెంటిమెంట్ పై ఆధారపడకుండా ప్రజా రాజకీయాలు చేస్తేనే గుర్తింపు అని 2023 ఎన్నికలతో తేలిపోయింది. అందుకే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా రాజకీయాలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. తెలంగాణ సమాజంలో ఏ పార్టీ కూడా అతీతం కాదు.

తాజాగా కవిత నేతృత్వంలోనే తెలంగాణ రక్షణ సేన కూడా ఇదే ఫార్ములాను అనుసరిస్తోంది. ప్రజల మధ్య ఉంటూ ప్రజా రాజకీయం చేయాలని భావిస్తోంది. కేవలం తన తండ్రి పార్టీ, ఒకప్పటి టిఆర్ఎస్ మాదిరిగా ప్రత్యేక రాష్ట్రం, తెలంగాణ పేరు చెప్పుకుంటే వర్కౌట్ కాదని గుర్తించిన కవిత కొత్త రాజకీయం దిశగా అడుగులు వేస్తున్నారు.

  • ప్రజా సమస్యల ప్రస్తావన..

ఇటీవల కవిత రాజకీయం చూస్తే ఇట్టే అర్థం అవుతుంది. ఆమె కింది స్థాయిలో ప్రజా సమస్యలను గుర్తించి వాటిపై స్పందిస్తున్నారు. తాజాగా ఆదాయం కోసం ఓలా, రాపిడో, బ్లీంకిట్, స్విగ్గి వంటి సంస్థల్లో బైక్, టాక్సీలు నడుపుకుంటూ జీవనం చేస్తున్న నిరుద్యోగ యువత, విద్యార్థుల కష్టాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు కవిత.

ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా వారి సమస్యలను గుర్తించలేదు. అటువంటిది కవిత వారి పక్షాన గళం విప్పడం విశేషం. బైక్ టాక్సీ లకు పసుపు రంగు నంబర్ ప్లేట్లు తప్పనిసరి చెయ్యాలనే ప్రభుత్వం ఆలోచన.. సామాన్య గిగ్ వర్కర్ల ఉపాధిని గండి కొడుతుందని ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

తద్వారా కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా.. నిత్యజీవితంలో ప్రజలు ఎదుర్కొనే ప్రతి చిన్న సమస్యను లోతుగా పరిశీలిస్తూ… వారికి అండగా నిలవడం ఆమె రాజకీయ ప్రత్యేకత గా నిలుస్తుంది.

  • వారిది విలక్షణ పాత్ర..

తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులతో పాటు నిరుద్యోగులది ప్రత్యేక స్థానం. దానిని మరిచి రాజకీయం చేసింది భారత రాష్ట్ర సమితి. అది తెలంగాణ సమాజంలో ఎంతో నష్టం చేసింది ఆ పార్టీకి. దానిని గుర్తించి రాజకీయం చేస్తున్నారు కవిత. సాధారణ వైట్ ప్లేట్ వాహనాన్ని కమర్షియల్ పసుపు ప్లేట్గా మార్చాలంటే.. కచ్చితంగా మోటార్ వెహికల్ చట్టాల ప్రకారం కమర్షియల్ ఇన్సూరెన్స్, పర్మిట్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు తప్పనిసరి.

అయితే రోజువారి సంపాదనపై ఆధారపడే పార్ట్ టైం రైడర్లకు ఇది తలకు మించిన భారం. పసుపు నెంబర్ ప్లేట్లు ఉంటే ఆ బండిని వ్యక్తిగత అవసరాలకు మాత్రమే వాడుకోవాలి. ఈ నిబంధనను తెరపైకి తెచ్చి వాహనదారులపై నియంత్రణకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆరోపణ కవిత తెరపైకి తెచ్చి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తద్వారా సాధారణ ప్రజల అభిమానాన్ని చురగొనే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు