Homeతెలంగాణపలువురికి ఆదర్శంగా పెద్దగూడెం సర్పంచ్ పోశం రమణమ్మ కోటిరెడ్డి

పలువురికి ఆదర్శంగా పెద్దగూడెం సర్పంచ్ పోశం రమణమ్మ కోటిరెడ్డి

    • సంక్రాతి సందర్బంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విందు భోజనం
  • హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు

క్రైమ్ మిర్రర్,పెద్దవూర ప్రతినిధి: నల్గొండ జిల్లా పెద్దగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ పోశం రమణమ్మకోటిరెడ్డి పలువురికి ఆదర్శంగా నిలిచారు.

సంక్రాంతి పండుగ పూట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు సంక్రాంతి సంబరాల నేపథ్యంలో గ్రామ పరిధిలో ఉన్న 3ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంచి విందు భోజనం అందించి పలువురిని ఆకట్టుకున్నారు.

పాఠశాలల హలో బేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు అందరిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా తనమందు సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు.

 

ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు సర్పంచ్ రమణమ్మ కోటిరెడ్డి లను ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్రాంతి సంబరాలు పూట విద్యార్థులకు విందు భోజనం అందించడం మంచి పరిణామం అని అలాగే నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం సర్పంచ్ కష్టపడి పని చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పెద్దగూడెం గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు