
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- శ్రీలంక మరియు భారత్ మహిళల మధ్య తాజాగా జరుగుతున్న T20 సిరీస్లో భాగంగా భారత మహిళల క్రికెట్ ప్లేయర్లు రికార్డులు సృష్టిస్తున్నారు. ఇప్పటికే మూడు టి20 మ్యాచ్ లలో గెలిచిన టీమిండియా మహిళల జట్టు ప్లేయర్లు తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో సత్తా చాటారు. అంతర్జాతీయ టి20 ఉమెన్స్ ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ లో ఏకంగా ముగ్గురు మహిళలు మనవాళ్లే నిలిచారు. శ్రీలంకతో జరిగినటువంటి టి20 సిరీస్లో భాగంగా శఫాలి వర్మ అద్భుతంగా రాణిస్తూ ఉన్న కారణంగా ఆమె నాలుగు స్థానాలు ఎగబాకి 736 పాయింట్లతో ఏకంగా ఆరవ ర్యాంకు సొంతం చేసుకున్నారు. ఇప్పటికే తొలి స్థానంలో ఆసీస్ ప్లేయర్ బెత్ మూనీ(794) ఉండగా, రెండవ స్థానంలో స్మృతి మందన (767), పదో స్థానంలో జమీమా(643) ఉన్నారు. దీంతో మొన్నటి వరకు కేవలం ఇద్దరు మాత్రమే టాప్ టెన్ ర్యాంకింగ్స్లో మన భారత మహిళా ప్లేయర్లు ఉండగా నేడు శఫాలి వర్మ వచ్చి చేరడంతో టాప్ టెన్ ఐసిసి ర్యాంకింగ్స్ లో భారత్ మహిళలే ముగ్గురు ఉన్నారు. దీంతో భారత జట్టు మహిళా ప్లేయర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ ర్యాంకింగ్స్ ను మెరుగుపరుచుకుంటున్నారు.
Read also : ఎన్కౌంటర్లు నిలిపివేయాలి : మిరియాల వెంకటేశ్వర్లు
Read also : 2 లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసి అందజేత





