Saturday, March 14, 2026
Homeక్రీడలుఅర్జున్ టెండూల్కర్ పెళ్లి.. కుటుంబ సమేతంగా మోదీకి సచిన్ ఆహ్వానం

అర్జున్ టెండూల్కర్ పెళ్లి.. కుటుంబ సమేతంగా మోదీకి సచిన్ ఆహ్వానం

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కుటుంబంతో కలిసి తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. గత కొద్ది రోజుల క్రితం అర్జున్ మరియు సానియాకి ఎంగేజ్మెంట్ జరగగా మార్చి 5వ తేదీన పెళ్లిని నిశ్చయించుకున్నారు. ఈ తరుణంలోనే సచిన్ టెండుల్కర్ కుటుంబ సమేతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి మార్చి 5న జరగబోయేటువంటి నా కొడుకు అర్జున్ పెళ్లికి రావాలి అని ఆహ్వానం పంపినట్లుగా సోషల్ మీడియా వేదికగా సచిన్ టెండూల్కర్ తెలిపారు. అనంతరం నరేంద్ర మోదీని కలిసి ఆహ్వానించడం చాలా గర్వంగా ఉంది అంటూ పేర్కొన్నారు. “యంగ్ కపుల్ ను ఆశీర్వదించి,ఎంతో విలువైన సలహాలు ఇచ్చినందుకు” గాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు అని పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీని కలిసి పెళ్లి వేడుకకు ఆహ్వానించినట్లు కూడా ప్రకటించారు. అలాగే ఈ పెళ్లికి ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు మరియు రాజకీయ సెలబ్రిటీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో జన్మించిన యువకులకు సచిన్ టెండూల్కర్ గురించి తెలియకపోవచ్చు కానీ ఆ రోజుల్లోని వ్యక్తులకు మాత్రం సచిన్ టెండూల్కర్ క్రికెట్లో సృష్టించిన రికార్డులు మాత్రం ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటాయి.

Read also : ITI Student: ప్రియురాలికి వీడియో కాల్ చేసి ఊహించని పని చేసిన బాలుడు

Read also : Yogi Adityanath: అయోధ్యలో బాబ్రీ పునర్నిర్మాణం.. సీఎం యోగీ సంచలన వ్యాఖ్యలు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments