Friday, March 6, 2026
Homeక్రీడలుభారత్‌ కోసం కొలంబో పిచ్‌ను మార్చొచ్చు... పాక్‌ మాజీ క్రికెటర్‌ అక్కసు

భారత్‌ కోసం కొలంబో పిచ్‌ను మార్చొచ్చు… పాక్‌ మాజీ క్రికెటర్‌ అక్కసు

 

భారత్‌ మ్యాచ్‌ గెలిచేందుకు కొలంబో పిచ్‌ను రాత్రికి రాత్రే మార్చేయొచ్చని పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ సక్లయిన్‌ ముస్తాక్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఈనెల 15న శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో భారత్‌-పాకిస్తాన్‌ హైఓల్టేజ్‌ మ్యాచ్‌ జరగనుది. అయితే, ఈ మ్యాచ్‌ను భారత్‌ను ఎలాగైనా గెలిచేందుకు ఐసీసీని ప్రభావితం చేయొచ్చని సక్లయిన్‌ నిరాధార ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో గ్రౌండ్‌లో పిచ్‌లను మార్చేయొచ్చని… ఎవరికీ తెలియకుండా గ్రౌండ్‌మెన్‌ పిచ్‌ను ఏదైనా చేయొచ్చని అక్కసును వెళ్లగక్కారు. భారత్‌కు ఐసీసీ తలొగ్గి పనిచేస్తుందని అందరికీ తెలుసని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సక్లయిన్‌ ముస్తాక్‌. కాగా, హైబ్రిడ్‌ మోడల్‌లో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ తన మ్యాచ్‌లన్నింటినీ శ్రీలంక వేదికగానే ఆడుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments