Homeతెలంగాణమాడుగులపల్లి: రోడ్డు భద్రత నియమాలపై ఆటో డ్రైవర్స్ కు అవగాహన

మాడుగులపల్లి: రోడ్డు భద్రత నియమాలపై ఆటో డ్రైవర్స్ కు అవగాహన

  • మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు
  • రోడ్డు భద్రత నియమాల పై ఆటో డ్రైవర్స్ కు, ఓనర్స్ కు అవగాహన కార్యక్రమం
  • మండల ఎస్ఐ ఎస్.కృష్ణయ్య వెల్లడి

క్రైమ్ మిర్రర్, మాడుగులపల్లి ప్రతినిధి: నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలోని సెంటర్‌ లో మంగళవారం ఎస్‌ఐ ఎస్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ కృష్ణయ్య మాట్లాడుతూ..

ఎస్‌పి శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు, మిర్యాలగూడ రూరల్‌ సీఐ ఉత్తర్వుల ప్రకారం మండల కేంద్రంలోని ఆటో యూనియన్‌ డ్రైవర్లతో అవగాహనా సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు. రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ వాహనాలను నడిపే ఆటో డ్రైవర్లు మద్యం సేవించరాదని, సెల్‌ ఫోన్‌ తో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయరాదని అన్నారు.

ప్రతి వాహనాలకు రికార్డులు సక్రమంగా ఉండాలని, ఇన్సూరెన్స్‌ విధిగా చేయించాలని, ఆటో లలో పరిమితికి మించి ప్రయానికులను ఎక్కించరాదని, మోటార్‌ వెహికల్‌ ఆక్ట్‌ రూల్స్‌ ప్రకారం విధులు సక్రమంగా పాటించాలని, ఆటో డ్రైవర్స్‌ యూనిఫారం ధరించాలని తదితర అంశాలపై డ్రైవర్స్‌ కు ఎస్‌ఐ కృష్ణయ్య సూచించారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు