Friday, March 6, 2026
Homeక్రీడలువరల్డ్ కప్ మ్యాచులు చూస్తూ పెరిగాను... రాబోయే వరల్డ్ కప్ తప్పక గెలుస్తాం :...

వరల్డ్ కప్ మ్యాచులు చూస్తూ పెరిగాను… రాబోయే వరల్డ్ కప్ తప్పక గెలుస్తాం : రోహిత్ శర్మ

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 2027లో జరగబోయేటువంటి వన్డే వరల్డ్ కప్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఇద్దరు 2027లో జరగబోయేటువంటి వరల్డ్ కప్ ఆడుతారు లేదో అనే సందిగ్ధంలో ఫ్యాన్స్ అందరూ ఉండగా రోహిత్ శర్మ మాత్రం కచ్చితంగా 2027 వన్డే వరల్డ్ కప్ గెలవాలనుకుంటున్నట్లు ప్రకటించారు. మన దేశం కోసం 2027 వన్డే వరల్డ్ కప్ గెలవాలనుకున్నట్లుగా భారత క్రికెటర్ రోహిత్ శర్మ పేర్కొన్నారు. గతంలో టి20 వరల్డ్ కప్ అలాగే ఐపీఎల్ వంటివి లేవు. కాబట్టి ఆ ఒక్క ట్రోఫీ లేదని నిరాశ నాలో ఎప్పటికీ ఉంటుంది అని అన్నారు. వన్డే వరల్డ్ కప్ గెలవడమే నా కెరియర్లో అతి పెద్ద లక్ష్యం అని తాజాగా జరిగినటువంటి ఓ ఈవెంట్లో భాగంగా రోహిత్ శర్మ స్పష్టం చేశారు. ఎన్నో వన్డే వరల్డ్ కప్ లు చూస్తూ పెరిగాను అని తెలిపారు. కాగా చివరి వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ సారధ్యంలోనే టీమిండియా రన్నర్ అప్ గా నిలిచింది. దీంతోనే రాబోయే వన్డే వరల్డ్ కప్ లో కచ్చితంగా టీం ఇండియా గెలిచి తీరాలి అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఫ్యాన్స్ అందరూ కూడా రోహిత్ మరియు కోహ్లీ వన్డే వరల్డ్ కప్ లో ఆడితేనే విజయం సాధిస్తామని వారు అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Mumbai Mayor Ritu: 44 ఏళ్ల తర్వాత ముంబై పీఠంపై బీజేపీ, బీఎంసీ మేయర్‌గా రీతూ తావ్‌డే!

Khawaja Asif: అమెరికా మమ్మల్ని టాయ్‌లెట్‌ పేపర్‌లా వాడుకుంది, పాక్‌ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments