Friday, March 6, 2026
Homeజాతీయంచల్లారింది అని "టీ" ని మళ్లీ వేడి చేస్తున్నారా?.. అయితే ఇది మీకోసమే?

చల్లారింది అని “టీ” ని మళ్లీ వేడి చేస్తున్నారా?.. అయితే ఇది మీకోసమే?

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ఈ రోజుల్లో చాలా మంది ఉదయాన్నే లేచిన వెంటనే టీ తాగడం అలవాటు చేసుకున్నారు. ప్రశాంతత కోసము అని, తల తిప్పుతుంది, ఫ్రెష్ నెష్ కోసము అని ఇలా ఏదో ఒక కారణం తోటి ప్రతి ఒక్కరూ కూడా కాఫీ లేదా టీలకు అలవాటు పడిపోయారు.. అయితే చాలామంది చల్లారిన ‘టీ’ ని మళ్ళీ వేడి చేసి తాగుతూ ఉంటారు. కానీ అలా చేయడం శరీరానికి అసలు మంచిది కాదు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చల్లారిన టీని మళ్లీ వేడి చేయడం ఆరోగ్యానికి హానికరము అని చెబుతున్నారు ఒకసారి రీ హీట్ చేయడం వల్ల చాయ్ అనేది చేదుగా అలాగే పూర్తి ఎసిడిటిక్ గా మారుతుంది అని అంటున్నారు. రీ హీట్ చేసిన చాయ్ తాగడం వల్ల కడుపులో తిప్పడం, అసిడిటీ, హార్ట్ బర్న్, ఛాతిలో మంట వంటి సమస్యలు ఏర్పడతాయి. అందులో చేరుకున్నటువంటి బ్యాక్టీరియా వల్ల కడుపులో తీవ్రమైన నొప్పి, వాంతులు అలాగే ఫుడ్ పాయిజన్ కూడా అప్పుడప్పుడు అవ్వొచ్చు అని వైద్యులు చెబుతున్నారు. అలాగే మొదటిసారి టీ తో పోలిస్తే రెండోసారి మళ్లీ టీని వేడి చేయడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు తగ్గుతాయి అందుకే అలవాటు ఉన్నవారు ఒకసారి మాత్రమే అంటే ఫ్రెష్ గానే తాగండి. ఒకసారి వేడి చేసిన టీ ని మరలా వేడి చేయొద్దు అని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ అలా డైలీ చేస్తే ఖచ్చితంగా ఆరోగ్యానికి ప్రమాదమే.

వరల్డ్ కప్ మ్యాచులు చూస్తూ పెరిగాను… రాబోయే వరల్డ్ కప్ తప్పక గెలుస్తాం : రోహిత్ శర్మ

Mumbai Mayor Ritu: 44 ఏళ్ల తర్వాత ముంబై పీఠంపై బీజేపీ, బీఎంసీ మేయర్‌గా రీతూ తావ్‌డే!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments