
పాకిస్తాన్ కళ్లు మూసి తెరిచేలోగా అక్కడి మిలటరీ, ఎయిర్ బేస్ లు లేపేస్తోంది ఇండియన్ ఆర్మీ. ఇదే సమయంలో పాక్ ఆర్మీ చేస్తున్న డ్రోన్, మిసైల్ దాడులను సమర్థంగా తిప్పికొడుతోంది. పాకిస్తాన్ లోని ఐదు మేజర్ ఎయిర్ బేస్ లను ఇండియా చెల్లాచెదురు చేసేసింది. పాకిస్తాన్ లోనే అతిపెద్దదైన సర్గోదా ఎయిర్ బేస్ తో పాటు నూర్ ఖాన్ ఎయిర్ బేస్, చక్లాలా ఎయిర్ బేస్, సియాల్ కోట్ ఎయిర్ బేస్, మురిద్ ఎయిర్ బేస్ లను భారత వాయుసేన బాంబులతో పేల్చేసింది.
మరోవైపు ఎనిమిది పాకిస్థానీ ఎయిర్ బేస్ లను కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్లాస్ట్ చేసింది. రఫిఖి, మురిద్, చక్లాలా, రహీమ్ యార్ ఖాన్, సుక్కుర్, చునియన్, పస్రూర్ రాడార్ సైట్, సియాల్ కోట్ ఏవియేషన్ కోట్ లను భారత వాయుసేన బాంబులతో లేపేసింది.