-
వైయస్సార్ కాంగ్రెస్ బాధ్యతలు ఎవరు చూస్తారు?
-
గతంలో అండగా తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల
-
ఇప్పుడు మాత్రం భార్య భారతి, ఇద్దరు కుమార్తెల పై భారం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తారా? ఆయన జైలుకు వెళ్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఆ పార్టీకి సమర్థవంతమైన నేత ఎవరు? పొలిటికల్ సర్కిల్స్లో దీనిపైనే ఆసక్తికర చర్చ. ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఏపీ డిప్యూటీ సీఎం కలిసినట్లు.. జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టమని కోరినట్టు.. అందుకు అమిత్ షా అంగీకరించకపోగా క్లాస్ పీకినట్లు.. ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు బయటపెట్టారు.. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో చెప్పలేం కానీ.. జగన్మోహన్ రెడ్డి జైలు అనే మాట వినిపించింది. ఆయన జైలుకు వెళ్తే పార్టీని ఎవరు నడుపుతారు అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతోంది.
అప్పట్లో 16 నెలల జైలు…
కాంగ్రెస్ పార్టీతో విభేదించి జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. కానీ కాంగ్రెస్ హై కమాండ్ అవినీతి కేసులను తిరగదొడి జగన్మోహన్ రెడ్డిని 16 నెలల పాటు జైల్లో పెట్టింది. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ముఖ్యమంత్రి పదవిని కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే అది కాంగ్రెస్ సిద్ధాంతానికి వ్యతిరేకమని.. ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు అప్పట్లో. దీంతో ఓదార్పు యాత్ర పేరుతో రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల పరామర్శకు బయలుదేరారు జగన్. కానీ జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. 16 నెలల పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది జగన్. ఆ సమయంలో పార్టీకి అండగా నిలిచారు విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల. పార్టీకి నీడలా ఉంటూ కాపాడుకుంటూ వచ్చారు. అన్న కోసం పాదయాత్ర చేశారు షర్మిల. అయితే 2019లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిద్దరూ ఇప్పుడు దూరమయ్యారు. జగన్మోహన్ రెడ్డి వారిని దూరం పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.
భార్య భారతి దిక్కు…
ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పై పాత కేసులు ఉన్నాయి. గత 14 సంవత్సరాలుగా ఆయన బెయిల్ పై ఉన్నారు. ఒకవేళ ఆయనపై పెట్టిన కేసులు మళ్లీ తెరపైకి వచ్చి జగన్మోహన్ రెడ్డి అరెస్టు జరిగితే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు దిక్కు? అనే ప్రశ్న వినిపిస్తోంది. కచ్చితంగా ఆయన భార్య భారతి, కుమార్తెలు ఇద్దరు తమ భుజస్కందాలపై వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కర్త,, కర్మ, క్రియా జగన్మోహన్ రెడ్డి అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఆయనను మించి వైసీపీలో చరిష్మ ఎవరికీ లేదు. పైగా కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. ఈ సమయంలో ఆ మూడు పార్టీల ఉమ్మడి అజెండాను తట్టుకోవడం కష్టం. ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి జైలు పాలు అయితే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకా వికలం కాక తప్పదు. అయితే జగన్మోహన్ రెడ్డి భార్య భారతి, ఇద్దరు పిల్లలు మాత్రం కొంత నష్టాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది.