HomeUncategorizedసాధభైనమా భూములపై భారీ అక్రమాలు..!

సాధభైనమా భూములపై భారీ అక్రమాలు..!

  • గ్రామానికి చెందిన ఓ వ్య‌క్తి ల‌క్ష‌లు దండుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు

  • అధికారుల ప‌ని తీరుపై విమ‌ర్శ‌లు

క్రైమ్ మిర్రర్,రంగారెడ్డి ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నర్సయిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్య‌క్తి రెవెన్యూ అధికారులతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని సాధభైనామా భూములను టార్గెట్ చేస్తు లక్షల రూపాయలు దండుకున్నట్లు గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు.మాడ్గుల, నర్సయిపల్లి గ్రామాల పరిధిలో ఉన్న సాధభైనామా భూముల వ్యవహారంలోఓ వ్య‌క్తి కీలక పాత్ర పోషించాడని, భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని స్థానికులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే అమ్మకాలు పూర్తయిన భూములపై తిరిగి పట్టాలు మార్పిడి చేసి, పాస్‌బుక్ లు జారీ చేయిస్తూ లక్షల రూపాయలు దండుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు.

రెవెన్యూ అధికారుల సహకారంతో అడ్డగోలుగా వ్యవహరిస్తూ కోట్ల రూపాయల విలువైన భూములను ఇతరుల పేర్లపై అక్రమంగా మార్పిడి చేశాడని గ్రామస్తులు మండిపడుతున్నారు. ధరణి వ్యవస్థలోని లోసుగుల ద్వారా మాడ్గుల తహసీల్దార్ కార్యాలయంలో ఇలాంటి భూ అక్రమాలు మరెన్నో జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రెవెన్యూ అధికారులు పైరవి కార్లతో కుమ్మక్కై ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు మండల ప్రజలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

సమగ్ర దర్యాప్తు చేయాలి – బాధితుల డిమాండ్

మాడ్గుల మండలంలో అక్రమంగా భూ బదలాయింపులపై జరిగిన వ్యవహారంలో జిల్లా రెవెన్యూ ఉన్నత అధికారులు, విజిలెన్స్ అధికారులు తక్షణమే సమగ్ర దర్యాప్తు జరిపి మామూళ్ల మత్తులో అందుకు సహకరించిన రెవెన్యూ అధికారులపై, భూ బాధలాయింపులకు తెరలేపిన పైరవీ కారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు