Homeతెలంగాణభారీగా పెరిగిన వాణిజ్య సిలిండ‌ర్ ధ‌ర‌లు...!

భారీగా పెరిగిన వాణిజ్య సిలిండ‌ర్ ధ‌ర‌లు…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: వాణిజ్య అవ‌స‌రాల‌కు,హోట‌ళ్ల‌కు వినియోగించే గ్యాస్ ధ‌ర‌లు చ‌మురు సంస్థ‌లు అమాంతంగా పెంచేశాయి. ఒక్క సిలిండర్ (19 కేజీలు)పై సగటున రూ.993 పెంచుతున్నట్లు చమురు సంస్థ పేర్కొన్నాయి. నేటి నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని కేంద్రం వెల్లడించింది. ప‌శ్చిమా ఆసియాలో మెరికా ఇజ్రాయెల్‌, ఇరాన్ మ‌ధ్య యుద్దం త‌గ్గుతుందో తెలియ‌డం లేదు. దీంతో ఇంధ‌న ర‌వాణ‌కు అత్యంత కీల‌క‌మైన హ‌ర్మూజ్ జ‌ల‌సంధిలో అంత‌రాయాలు ఈ పెంపుకు కార‌ణ‌మ‌య్యాయి.

మూడు సార్లు ధ‌ర‌ల పెంపు…

ప‌శ్చిమాసియ‌లో ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభంకాగా అప్పటి నుంచి వాణిజ్య సిలిండర్ ధరను మూడుసార్లు పెంచినట్లయింది. మార్చిలో రూ.144, ఏప్రిల్ ఒకటిన రూ.195, ఇప్పుడు అమాంతం రూ.993 పెరిగింది. దీంతో ఒక్క సిలిండర్ ధర రూ.3వేలు దాటింది. హైదరాబాద్ లో ఆ ధర రూ.3,315కు చేరింది. ఢిల్లీలో ఒక బండ ధర రూ.3,071గా ఉంది.

ఈ ప్రభావం రెస్టారంట్లు, హోటళ్ల వ్యాపారాన్ని దెబ్బతీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. హోటళ్లు ఆ భారాన్ని వినియోగదారులపై మోపే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులేదు. దేశీయ విమాన సంస్థలకు కూడా కేంద్రం ఊరట కల్పించింది. ఏవియేషన్ టర్బైన్ ప్యూయల్ ధరల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదు. ఇక, ఐదు కిలోల సిలిండర్ ధర రూ.914.50కి పెరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు