దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)ని నేరుగా లేదా ఏకపక్షంగా పదవి నుంచి తొలగించే అధికారం ఎవరికీ ఉండదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం దీనికి సుదీర్ఘమైన, నిర్దిష్టమైన ప్రక్రియ ఉంటుంది.సిఈసిని తొలగించాలంటే మొదట పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టాలి. ఇందుకోసం లోక్‌సభలో అయితే కనీసం 100 మంది సభ్యులు, రాజ్యసభలో అయితే కనీసం 50 మంది ఎంపీలు సంతకాలు చేసి ఆయా సభల స్పీకర్ లేదా ఛైర్మన్‌కు నోటీసు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ స్పీకర్ లేదా ఛైర్మన్ ఈ నోటీసును తిరస్కరిస్తే ఆ ప్రక్రియ అక్కడితోనే నిలిచిపోతుంది.
వారు ఆమోదిస్తే, ఆ ఆరోపణల నిజానిజాలను తేల్చేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) లేదా ఆయన సూచించిన న్యాయమూర్తి, ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్, అలాగే ఒక ప్రముఖ న్యాయనిపుణుడు సభ్యులుగా ఉంటారు. కమిటీ విచారణ జరిపి, మోపబడిన ఆరోపణలు నిజమేనని నిర్ధారిస్తే ఆ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఉభయ సభల్లోనూ (లోక్‌సభ, రాజ్యసభ) హాజరైన సభ్యుల్లో 2/3 వంతు ప్రత్యేక మెజార్టీతో తీర్మానానికి అనుకూలంగా ఓటింగ్ జరగాల్సి ఉంటుంది. పార్లమెంట్ ఆమోదం తెలిపిన అనంతరం రాష్ట్రపతి ఆదేశాల ద్వారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తొలగింపు పూర్తవుతుంది. Supreme Court న్యాయమూర్తిని తొలగించేంత కఠినమైన విధానమే CECకి కూడా వర్తిస్తుంది.
ఇందిరా గాంధీకే ఎదురైన ప్రజా వ్యతిరేకత మోదీకి ఎందుకు రాదు?: రాహుల్ గాంధీ ప్రశ్న
