Homeక్రైమ్దారుణం...లావుగా ఉంద‌ని భార్య‌ను హ‌త్య చేసిన భ‌ర్త‌...!

దారుణం…లావుగా ఉంద‌ని భార్య‌ను హ‌త్య చేసిన భ‌ర్త‌…!

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: భార్య లావుగా ఉంద‌ని తీవ్ర అస‌హ‌నానికి గురైన భ‌ర్త గొంతు నులిమి హ‌త్య చేసిన ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లో ఈ దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ర్ణాటకలోని ధారవాడ జిల్లాలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. స్టాఫ్ నర్సుగా పని చేస్తున్న ప్రియాంక కమలాకర్‌ (29)ను ఆమె భర్త బసవరాజ్ వడ్డార్ గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:పెట్రోల్ ధరల తగ్గింపు ఇప్పట్లో లేనట్టే!

2024 డిసెంబర్‌లో ప్రియాంక, బసవరాజ్‌లకు వివాహం జరిగింది. అయితే వివాహం జరిగిన కొద్ది రోజులకే ఆమె వైవాహిక జీవితం నరకంగా మారింది. భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులు అదనపు కట్నం, నగదు, బంగారం తీసుకురావాలని నిరంతరం ఒత్తిడి తెచ్చేవారని, ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించేవారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రియాంక లావుగా ఉందంటూ తరచూ అవమానించేవారని, ‘నువ్వు నాకు నచ్చలేదు’, ‘నువ్వు పిల్లలకు జన్మనివ్వలేవు’ అంటూ భర్త తరచుగా దూషించేవాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

Also Read:విశాఖలో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల దుర్మరణం

వివాహం తర్వాత ప్రియాంక రెండుసార్లు గర్భం దాల్చినా, భర్త తరచూ చేసిన దాడుల కారణంగా రెండుసార్లూ గర్భస్రావం జరిగిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు (Karnataka Crime News). సోమవారం రాత్రి హనసి గ్రామంలోని ఇంట్లో బసవరాజ్ ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి రావడంతో గ్రామంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త బసవరాజ్ వడ్డార్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులను అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

Also Read:సీఎం విజయ్‌ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. రూ.35 కోట్ల భారీ డీల్‌ బహిర్గతం

 

తాజావార్తలు