Homeతెలంగాణతెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్!

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్!

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలోనీ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులకు డిఏ పెంచుతూ కీలక ప్రకటన చేశారు. దాదాపు 2.1 శాతం DA ను పెంచుతున్నట్లుగా మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు అధికారులతో చర్చించిన తర్వాత ప్రకటించడంతో ఆర్టీసీ ఉద్యోగుల ముఖాల్లో సంతోషం కనబడుతోంది. దీంతో 50.7 నుంచి 52.8% శాతానికి డిఏ పెరగనుంది. 2026 నూతన ఏడాది జనవరి ఒకటవ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది అని ఇప్పటివరకు గడిచిన మూడు నెలల బకాయిలను ఒక్కో నెలలో సప్లమెంటరీ బిల్స్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా చెల్లిస్తుంది అని తెలిపారు. ఒకవైపు ఆర్టీసీ ఉద్యోగులకు ఇది ఒక గుడ్ న్యూస్ అయినప్పటికీ తెలంగాణ ఆర్టీసీ పై ప్రతినెల 2.82 కోట్ల రూపాయలు అదనపు భారమైతే పడనుంది.

శ‌బ‌రిమ‌ల‌లో మ‌హిళ‌ల ప్ర‌వేశం పై ఆంక్ష‌లు మ‌త‌ప‌ర‌మైన‌వే…స‌మ‌ర్థించిన సుప్రీం కోర్టు…!

మర్రిగూడలో ఆగని వరుస దొంగతనాలు…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు