Homeతెలంగాణమాడులపల్లి: వార్డ్ మెంబర్ లకు జనరల్ ఓరియంటేషన్ శిక్షణ ప్రారంభం

మాడులపల్లి: వార్డ్ మెంబర్ లకు జనరల్ ఓరియంటేషన్ శిక్షణ ప్రారంభం

క్రైమ్ మిర్రర్, మాడులపల్లి ప్రతినిధి: నల్గొండ జిల్లా పంచాయితీ అధికారి ఆదేశాల మేరకు మాడులపల్లి మండలము ప్రజాపరిషిత్ అధికారి(MPDO) జి.వంశీధర్ అధ్యక్షతన నూతనముగా ఎన్నిక కాబడిన గ్రామా పంచాయితీ వార్డ్ మెంబర్ లకు జనరల్ ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వార్డ్ మెంబర్లు
శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వార్డ్ మెంబర్లు

కార్యక్రమంలో భాగంగా మండలము పరిధిలోని గ్రామాలను రెండు గ్రూపులుగా విభజించారు.మొదటి గ్రూప్ లో 13 గ్రామాలు, రెండో గ్రూప్ లో 14 గ్రామాలుగా విభజించారు. మొదటి గ్రూప్ తేది:16.02.2026 నుండి 20.02.2026 వరకు రెండొవ బ్యాచ్ తేది:23.02.2026 నుండి 27.02.2026 వరకు నిర్వహిస్తున్నారు. ఐయితే సోమవారం(ఫిబ్రవరి 16) మొదటి బ్యాచ్ లో 13 గ్రామాలు

1 ఆగమోత్కూర్,

2 భీమానపల్లి,

3 బొమ్మకల్,

4 చిరుమర్తి,

5 గండ్రవని గూడెం,

6 గుర్రప్పగూడెం,

7 ఇసకబాయి గూడెం,

8 కాల్వలపాలెం,

9 కుక్కడం,

10 పాములాపహాడ్,

11 పోరెడ్డిగూడెం,

12 సీత్య తండా,

13 తోపుచర్ల  లకు MRC బిల్డింగ్ మాడులపల్లి నందు ఉదయం 9.00 గం.ల నుండి సాయంత్రము 5.00 గం.ల వరకు ToT (Trainng of Trainers) యస్.వినయ్ కుమార్, వి.శివ, పి దుర్గయ్య మరియు జి. సతీష్ లతో శిక్షణ కార్యక్రమం ఇవ్వటం జరిగినది. ఇట్టి కార్యక్రమము నందు మండల ట్రైనర్ లింగా రెడ్డి గారు , MPO T.సంగీత గారు పాల్గొన్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు