Homeతెలంగాణచాక్లెట్ ఆశ చూపి నాలుగేళ్ల చిన్నారి పై దారుణం

చాక్లెట్ ఆశ చూపి నాలుగేళ్ల చిన్నారి పై దారుణం

చౌటుప్పల్ (క్రైమ్ మిర్రర్): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం చోటుచేసుకుంది. చాక్లెట్ ఇస్తామని చెప్పి అమాయక బాలికను మోసం చేసిన ఇద్దరు మధ్యప్రదేశ్ యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది.

Also Read:మునుగోడులో పోలీస్ శాఖ ఆధ్వర్యములో రన్ ఫర్ యూనిటీ

సమాచారం మేరకు, చిన్నారి ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా నిందితులు చాక్లెట్ ఇస్తామని చెప్పి లోపలికి పిలిచారు. బాలిక కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని తలుపులు పగలగొట్టి ఆమెను రక్షించారు. అనంతరం కోపంతో ఊగిపోయిన ప్రజలు ఇద్దరు నిందితులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

Also read:ఖమ్మం సీపీఎం సీనియర్ నేత దారుణ హత్య…

బాలికను తక్షణమే సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. పోలీసులు నిందితులను కస్టడీలోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చిన్నారుల భద్రతకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read:ఉక్కు మనిషి ఆశయాలతో – రన్ ఫర్ యూనిటీ

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు