Homeక్రైమ్జనగాంలో దారుణం.. భార్యపై దాడి, ఇద్దరు పిల్లల్ని తీసుకొని పరార్ అయిన భర్త

జనగాంలో దారుణం.. భార్యపై దాడి, ఇద్దరు పిల్లల్ని తీసుకొని పరార్ అయిన భర్త

తెలంగాణ రాష్ట్రంలోని జనగాం జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బచ్చన్నపేట మండలం ఓబుల కేశవపురం గ్రామానికి చెందిన ఓ మహిళపై ఆమె భర్త తీవ్రంగా దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

స్థానిక సమాచారం ప్రకారం, మహేందర్ రెడ్డి అనే వ్యక్తి … తనకు మరో మహిళతో ఉన్న ఎఫైర్ గురించి తన భార్య ప్రశ్నించడంతో… అది కాస్తా వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం కాస్త హింసాత్మకంగా మారింది. కోపోద్రిక్తుడైన భర్త ఆమెపై దాడి చేసి చేతులు, కాళ్లు విరగ్గొట్టి తీవ్రంగా గాయపరిచినట్లు తెలుస్తోంది.

ఇంతటితో ఆగకుండా, ఘటన అనంతరం మహేందర్ రెడ్డి తమ ఇద్దరు పిల్లలను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న మాధవి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. తనపై ప్రాణహాని కలిగించేలా భర్త దాడి చేశాడని ఆమె ఆరోపించింది.

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

also read: అగ్నివీర్ రిక్రూట్‌మెంట్‌లో విషాదం.. పరుగు పరీక్షలో కుప్పకూలి యువకుడి మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు