Homeఆంధ్ర ప్రదేశ్చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో..ఐదుగురికి ఉరిశిక్ష

చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో..ఐదుగురికి ఉరిశిక్ష

క్రైమ్ మిర్రర్ ఆంధ్రప్రదేశ్ బ్యూరో: 2015 నవంబర్ 17న చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ ఛాంబర్లోనే చిత్తూరు మాజీ మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ ను దారుణ హత్య జరిగిన విషయం విదితమే, అయితే ఈ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

ఈ కేసులో ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు 6వ అదనపు జిల్లా కోర్టు (IX Additional District and Sessions Court) తీర్పు ఇచ్చింది. ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులుగా ఉండగా, 122 మంది సాక్షులను విచారించారు. సాక్ష్యాధారాలు లేకపోవడంతో మిగిలిన 16 మంది నిందితులను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది.

దాదాపు పదేళ్ల తర్వాత వెలువడిన ఈ తీర్పు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది.ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాలు మరియు రాజకీయ విభేదాల కారణంగా ఈ హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది.

శిక్ష పడినవారు (ఐదుగురు):

  1. ప్రధాన నిందితుడు కఠారి మోహన్ మేనల్లుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూ (A1),
  2. ఎం.వెంకటాచలపతి (అలియాస్ వెంకటేష్),
  3. మంజునాథ్ (అలియాస్ మంజు),
  4. జయప్రకాష్ (అలియాస్ జయారెడ్డి),
  5. మునిరత్నం వెంకటేష్.

Also Read: చాక్లెట్ ఆశ చూపి నాలుగేళ్ల చిన్నారి పై దారుణం

Also Read: ఖమ్మం సీపీఎం సీనియర్ నేత దారుణ హత్య…

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు