Homeక్రైమ్సృష్టి సరోగసి కేసులోడాక్టర్ నమ్రత అరెస్టు

సృష్టి సరోగసి కేసులోడాక్టర్ నమ్రత అరెస్టు

  • బ్యాంక్ ఖాతాల సీజ్‌

హైదరాబాద్, క్రైమ్ మిర్ర‌ర్ః సృష్టి ఫెర్టిలిటి స‌రోగ‌సి సెంట‌ర్ కేసులో డాక్ట‌ర్ న‌మ్ర‌త‌ను, ఆమె కొడుకును ఈడీ అధికారులు అరెస్టు చేశారు. స‌రోగ‌సి ముసుగులో అనేక అక్ర‌మాలు చోటుచేసుకున్న‌ట్లు గ‌తంలో అనేక ఫిర్యాదులు చేశారు.

ఈకేసు విష‌య‌మై డాక్ట‌ర్ న‌మ్ర‌త త‌ప్పించుకుని పారిపోయింది. ఎట్ట‌కేల‌కు అధికారులు అరెస్టు చేశారు. గిరిజ‌నుల వ‌ద్ద బిడ్డ‌ల‌నుకొనుగోలు చేసి స‌రోగ‌సి  ద్వ‌రాపుట్టిన‌ట్లున‌మ్మించి బాధితుల వ‌ద్ద నుంచి అనేక కోట్ల రూపాయ‌లు దండుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి

కాగా ఈ దాడుల్లో 30కోట్ల అక్ర‌మ ఆస్తులు ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. ఎనిమిది బ్యాంక్ ఖాతాలు సీజ్ చేశారు. స‌రోగ‌సి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ కూడా చేశారా అనే కోణంలో అధికారులు ద‌ర్య‌ప్తు చేస్తున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు