క్రైమ్ మిర్రర్, సినిమా:- టాలీవుడ్ హిట్ మెషీన్, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుసగా నందమూరి హీరోలతో సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కేవలం రెండు రోజుల క్రితమే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో తాను ఒక భారీ సినిమా చేయనున్నట్లు అనిల్ రావిపూడి అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో నందమూరి అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఎన్టీఆర్ సినిమా పూర్తయిన వెంటనే నటసింహం నందమూరి బాలకృష్ణతోనూ అనిల్ రావిపూడి మరో సినిమా చేయనున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారని సమాచారం. భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ ప్రాజెక్ట్ రూపొందనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ క్రేజీ కాంబినేషన్‌పై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘భగవంత్ కేసరి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి విదితమే. ఆ సినిమాలో బాలయ్యను అనిల్ రావిపూడి చూపించిన విధానం, ఎమోషన్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కలయికలో సినిమా రాబోతుందనే వార్తతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఒకవైపు ఎన్టీఆర్, మరోవైపు బాలకృష్ణతో వరుస ప్రాజెక్టులు ప్లాన్ చేస్తూ అనిల్ రావిపూడి నందమూరి ఫ్యాన్స్‌కు అసలైన పండుగ వాతావరణాన్ని తీసుకువస్తున్నారు.
