డిల్లీ, క్రైమ్ మిర్రర్: యుద్దంలో సర్వం కోల్పోయి దిగొచ్చిన ఇరాన్ శుద్ది చేసిన యురేనియంను తమకు ఇచ్చేందుకు అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కాగా ఇరు దేశాల మధ్య త్వరలేనే మంచి డీల్ కుదిరే అవకాశం ఉందని తెలిపారు.
ఇరాన్, అమెరికా సంబంధాలు చాలా వరకూ మెరుగుపడ్డాయి. దీన్ని చాలా మంది నమ్మలేకపోవచ్చు. నాలుగు వారాల పాటు సాగిన బాంబు దాడులు, దిగ్బంధనం వంటివి ఫలితాన్ని ఇచ్చాయని నేను అనుకుంటున్నాను’ అని ట్రంప్ అన్నారు. ఈ వారంలో రెండు దేశాల మధ్య మరోసారి జరిగే చర్చలకు తాను కూడ వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. రెండు దేశాల మధ్య ఈ వారాంతంలోనే మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉందని కూడా ట్రంప్ అన్నారు. అయితే, కాల్పుల విరమణను రోసారి పొడిగించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కూడా చెప్పారు.
పొడిగింపు అవసరం ఉండదనే అనుకుంటున్నట్టు చెప్పారు. ఇరాన్ గతంలో కంటే సానుకూలంగా యూఎస్‌తో వ్యవహరిస్తోందని అన్నారు. అయితే, చర్చలు విఫలమైతే మరోసారి దాడులు మొదలు కావొచ్చని కూడా హెచ్చరించారు. వచ్చే వారం కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగిసిపోనున్న విషయం తెలిసిందే. గతంలో బెట్టు చేసిన ఇరాన్ ప్రస్తుతం అనేక విషయాల్లో రాజీ ధోరణితో ఉందని కూడా చెప్పుకొచ్చారు.
.
