Homeక్రైమ్Hyderabad: ఏడాది తర్వాత బయట పడిన దారుణం..!

Hyderabad: ఏడాది తర్వాత బయట పడిన దారుణం..!

  • ఏడాది తర్వాత బయట పడిన దారుణం..!

  • తల్లి మృతదేహాన్ని ఇంట్లో బెడ్‌రూమ్‌లో పూడ్చిపెట్టి కుమార్తె

  • ప్రియుడితో కలిసి కుమార్తె తన తల్లిని చంపిన ఉదంతం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడాది తర్వాత వెలుగు చూసిన ఈ దారుణ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హత్య చేసిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఇంట్లోని బెడ్‌రూమ్‌లోనే పూడ్చిపెట్టి, పైన సిమెంట్, ఇసుకతో కాంక్రీట్ వేసి కప్పిపెట్టారు. జవహర్‌నగర్‌ పరిధిలోని కౌకూర్ భరత్ నగర్‌లో నివసించే అంజు (40) అనే మహిళ 2025 మే నుంచి కనిపించకుండా పోయింది. తన ప్రేమ వ్యవహారానికి తల్లి అడ్డుపడుతోందన్న కారణంతో చిన్న కుమార్తె ఇషిక, తన ప్రియుడు మాంటీ రాజ్‌తో కలిసి ఈ హత్యకు పాల్పడింది.

మే 12, 2025న మాంటీ రాజ్ బాధితురాలిని కత్తితో పొడవగా, ఇషిక అతనికి సహకరించింది. హత్య చేసిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఇంట్లోని బెడ్‌రూమ్‌లోనే పూడ్చిపెట్టి, పైన సిమెంట్, ఇసుకతో కాంక్రీట్ వేసి కప్పిపెట్టారు. ఇషిక స్వయంగా తన తల్లి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి, ఏడాది పాటు ఏమీ తెలియనట్లు నటించింది. అయితే, తల్లి పేరు మీద ఉన్న ద్విచక్ర వాహనాన్ని మాంటీ రాజ్ విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు అనుమానం వచ్చి విచారించడంతో అసలు నిజం బయటపడింది. పోలీసులు నిందితుడు మాంటీ రాజ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలుస్తుంది, మైనర్ అయిన ఇషికను జువైనల్ హోమ్‌కు పంపారు. పోలీసులు ఇంటి నుంచి మృతదేహాన్ని వెలికితీసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు