స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తీరును పాకిస్థాన్ ప్రజలతో పోలుస్తూ.. కాంగ్రెస్ దేశ వ్యతిరేక ధోరణిలోకి వెళ్తోందంటూ కంగనా విమర్శలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నాయకురాలు సుప్రియ శ్రీనతే కంగనా వ్యాఖ్యలను తప్పుబట్టారు. కంగనాను బీజేపీ నాయకత్వమే పెద్దగా పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానిస్తూ, ఆమెకు వైద్య సహాయం అవసరమని వ్యంగ్యంగా విమర్శించారు.
మరోవైపు కాంగ్రెస్ నేత ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ కూడా కంగనా వ్యాఖ్యలపై మండిపడ్డారు. దేశభక్తి గురించి కాంగ్రెస్‌కు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాజకీయ పార్టీలపై విమర్శలు చేయడం కంటే.. దేశ ప్రజలను కలిపే అంశాలపై మాట్లాడాలని కాంగ్రెస్ నేతలు సూచించారు. దీంతో కంగనా రనౌత్ వ్యాఖ్యలు, కాంగ్రెస్ నేతల కౌంటర్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
also read: ఎమ్మెల్యేలకు కొత్త కార్లు.. నెలకు రూ.75 వేల భత్యం: సీఎం విజయ్ కీలక ప్రకటన
