అమరావతి, క్రైమ్ మిర్రర్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వరం, వెలిగొండ, హంద్రీనీవా సుజల స్రవంతి, పోలవరం-నలమల్ల సాగర్ లింక్, చింతలపూడి ఎత్తిపోతల, వరికపూడిశెల, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనులపై సమీక్ష జరిపారు. రాష్ట్రంలో భూగర్భజలాల పెంపు, జల ధార, జల హారతి కార్యక్రమాల గురించి చర్చించారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1, 2 పనులను వచ్చే ఏడాది మార్చి లోగా పూర్తి చేయాలని నిర్దేశించారు. ఈ సందర్భంగా ట్విన్ టన్నెల్స్ లైనింగ్ పనులు 77శాతం , అప్రోచ్ చానల్ ఎర్త్ వర్క్ పనులు 98 శాతం, హెడ్ రెగ్యులేటర్ కాంక్రీట్ పనులు 71 శాతం, ఇరిగేషన్ టన్నెల్ లైనింగ్ 76 శాతం పూర్తైనట్టు అధికారులు సీఎంకు వివరించారు.
కేఎల్ బండ్ ఎర్త్ వర్క్, ఎంబార్క్మెంట్ పనులు ఈ ఏడాది జూన్ కల్లా పూర్తి చేస్తామని వివరించారు. ఆర్ అండ్ ఆర్ కి సంబంధించి 49 కాలనీలు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి, మరో 20 కాలనీలు 2027 ఏప్రిల్ కల్లా పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. మొదటి దశలో మొత్తం 38,060 నిర్వాసిత కుటుంబాలకు, ఇప్పటివరకు 16,763 కుటుంబాల తరలించాం. ఈ ఏడాది ఆగస్ట్ నాటికి 8,518 కుటుంబాలు, 2027 ఏప్రిల్కు 12,779 కుటుంబాలు తరలించాలని సీఎం సూచించారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.27,089 కోట్లు వ్యయం అయినట్టు వెల్లడించారు.
మరో రూ.5,108 కోట్లతో సివిల్, ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. వెలిగొండ స్టేజ్ 1కు సంబంధించి హెడ్ రెగ్యులేటర్ కాంక్రీట్ పనులు 74 శాతం, టన్నెల్ 2 బెంచింగ్ 94 శాతం, లైనింగ్ 66 శాతం, ఫీడర్ కెనాల్ రిటైనింగ్ వాల్ కాంక్రీట్ 84 శాతం, లైనింగ్ 8 శాతం పూర్తి అయింది. పురోగతిలో తీగలేరు కెనాల్ హెడ్ రెగ్యులేటర్ గేట్లు, ఈస్ట్రన్ మెయిన్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్, డైవర్షన్ రోడ్ పనులు కొనసాగుతున్నాయి. మొత్తం వెలిగొండ పనులు జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం, దీనికి రూ.2,042 కోట్లు వ్యయం కానుందని అంచనా వేస్తున్నామని తెలిపారు.
