కదిరి, క్రైమ్ మిర్రర్: సత్యసాయి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కదిరి మండలం కుమ్మరివాండ్ల గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక ఇంటిలో పొగవస్తుండడంతో అక్కడికి ప్రజలు వెళ్లి ఆర్పే ప్రయత్నం చేశారు. ఇంటిలో నిల్వించిన డిటోనేటర్లు, సిలిండర్లు పేలి సంఘటన స్థలంలోనే ఒక మహిళో పాటు మొత్తం ఐదుగురు మంది మృతి చెందారు.
పేలుడుతో ఇల్లు పూర్తిగా ద్వంసమైంది. మరో 12 మంది పరిస్థితి తీవ్రంగా ఉండడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మంత్రి సత్యకుమార్ ఆరా తీశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ మేరకు పోలీసులు సంఘటనకు గల కారనాలు దర్యాప్తు ప్రారంభించారు.
గ్రామంలో విషాద ఛాయలు…
అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఊరు ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్లు పేలి భారీ అగ్ని విపత్తు సంభవించడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. ఆ ప్రాంతంలో భయానక వాతావరణం చోటు చేసుకుంది. మృతుల కుటుంబాల రోదనలు మిన్నంటాయి. కాగా మిగితా 12 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు గుండెలో పగిలేలా రోదిస్తున్నారు.
