Homeక్రైమ్బడంగ్‌పేట్ బీజేపీ అద్య‌క్షుడి ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య‌...పార్టీ శ్రేణులో విషాదం...!

బడంగ్‌పేట్ బీజేపీ అద్య‌క్షుడి ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య‌…పార్టీ శ్రేణులో విషాదం…!

హైద‌రాబాద్, క్రైమ్ మిర్ర‌ర్ః హైద‌రాబాద్‌లో విషాదం ఘ‌ట‌న చోటు చేసుకుంది.రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి బ‌డంగ్‌పేట్ బీజేపీ అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్న ఆక‌స్మత్తు ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌నే వార్త తెలియ‌గానే బీజేపీ శ్రేణుల్లో విషాదం నెల‌కొంది. ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపింది. అంద‌రితో క‌లుపుగోలుగా ఉంటూ పార్టీ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొనే నాయ‌కుడు అర్థాంత‌రం ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌డంతో ఇటు పార్టీ శ్రేణుల్లో, అటు ప్ర‌జల్లో తీవ్రంగా క‌ల‌చివేసింది.

కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధి పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.రామకృష్ణారెడ్డి బడంగ్‌పేట్ ప్రాంతంలో జరిగిన అవినీతి అంశాలపై గతంలో పోరాటం చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన ఆకస్మిక మృతి రాజకీయ వర్గాల్లో, స్థానిక ప్రజల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు